కెనడాలో బలపడుతోన్న ఖలిస్తానీ ఉద్యమం... భారత్‌కు పొంచివున్న ముప్పు, విశ్లేషణ

1980వ దశకంలో సిక్కు వేర్పాటు వాదం మనదేశంలో రక్తపుటేరులు పారించిన సంగతి తెలిసిందే.

పాకిస్తాన్ మద్ధతుతో పంజాబ్‌కు చెందిన కొందరు సిక్కులు ప్రత్యేక ఖలిస్తాన్ దేశాన్ని కోరుతూ మారణహోమం సృష్టించారు.

ఈ పరిణామాలు.ఆపరేషన్ బ్లూస్టార్, ప్రధాని ఇందిరా గాంధీ హత్య, సిక్కుల ఊచకోత, పంజాబ్‌లో హింసాత్మక పరిస్థితుల వరకు దారి తీశాయి.

తదనంతర కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేయడంతో పంజాబ్‌లో శాంతి నెలకొంది.అయితే ఆయా దేశాల్లో స్థిరపడిన సిక్కుల్లో వున్న కొందరు ఖలిస్తానీ అనుకూల వాదులు నేటికీ ‘‘ఖలిస్తాన్’’ కోసం పోరాడుతూనే వున్నారు.

ప్రధానంగా కెనడాలో పెద్ద సంఖ్యలో స్థిరపడిన కొందరు పంజాబీ సంతతి వ్యక్తులు ఖలిస్తాన్ ఉద్యమానికి మద్ధతుగా నిలుస్తున్నారు.ఇటీవలి కాలంలో వేర్పాటు వాదులు భారత్‌లో చాపకింద నీరులా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

Advertisement

ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గేటుపై ఖలిస్తాన్ బ్యానర్లు, జెండాలు కనిపించడంతో కొద్దినెలల క్రితం దేశవ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే.పంజాబ్ రాష్ట్రంలో వేర్పాటువాదంతో పాటు హింసాత్మక తీవ్రవాదాన్ని ప్రోత్సహించడంలో ప్రమేయం వున్నందుకు గాను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) ప్రకారం ఎస్ఎఫ్‌జేను జూలై 2019లో భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే.

ఎస్ఎఫ్‌జే, బీకేఐ, కేటీఎఫ్, కేజడ్ఎఫ్ వంటి ఖలిస్తానీ సంస్థలు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని ఎన్ఐఏ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది.ఈ కుట్రల కోసం యూఎస్, యూకే, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి ఖలిస్తానీ గ్రూప్‌లకు భారీగా నిధులు అందుతున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.

అయితే కెనడాలో ఖలిస్తాన్ అనుకూల ఉద్యమం బలోపేతం అవుతుండటంపై భారత్ నిశితంగా గమనిస్తోంది.ప్రత్యేకించి అది కొత్త దశలోకి ప్రవేశించినట్లుగా కనిపిస్తోంది.

కెనడా, భారత్‌లలో కార్యకలాపాలు సాగించే వ్యవస్ధీకృత క్రిమినల్ గ్యాంగ్‌ల మధ్య బంధంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.కెనడాలో ఎనిమిది మంది ప్రముఖ ముఠా నాయకులు వున్నారని.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

వీరు ఇక్కడి నుంచే ప్రత్యక్ష కార్యకలాపాలు సాగిస్తున్నారని భారతీయ అధికారులు ఓ జాతీయ మీడియాతో చెప్పారు.కెనడాకు చెందిన కొందరు రాడికల్స్, గ్యాంగ్‌స్టర్‌ల మధ్య బంధంపై భారత నిఘా ఏజెన్సీలు దృష్టి సారిస్తున్నాయి.

Advertisement

ఈ గ్యాంగ్‌స్టర్ల పేర్లను వారు పేర్కొనప్పటికీ.భారత జాతీయ దర్యాప్తు సంస్థ, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసుల మధ్య జరుగుతున్న చర్చల్లో వారు వివరంగా చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది.

కెనడాలోని గ్యాంగ్‌స్టర్లు ఖలిస్తానీ గ్రూపులతో సంబంధాలను కాపాడుకోవడం ఇరు దేశాల అధికారులకు మరింత ఆందోళన కలిగిస్తోంది.వారిలో చాలా మంది భారత్‌లోని జైళ్లలో వున్నప్పుడు కలుసుకున్నారని దర్యాప్తులో తేలింది.

ఇండో కెనడియన్ గ్యాంగ్‌లు నానాటికీ బలోపేతం అవుతుండటంతో భారత్, కెనడాలలోని లక్ష్యాలపై వారు నేరుగా దాడి చేయగలరని దర్యాప్తు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో రిపుదమన్ సింగ్ మాలిక్‌ని లక్ష్యంగా చేసుకున్న హత్యకు ఇంకా ఎలాంటి ఉద్దేశ్యం ఆపాదించబడలేదు.అయితే ఇది గ్యాంగ్ ల్యాండ్ తరహా దాడిగా కనిపించింది.1985లో ఎయిరిండియా విమానం కనిష్కపై బాంబు దాడి చేసి 329 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో మాలిక్ పాత్ర వుందని ఆరోపణలు వచ్చాయి.అయితే, ఈ కేసులో ఆయన అన్ని అభియోగాల నుంచి విముక్తి పొందారు.

ఖలిస్తాన్‌ ఉద్యమంపై ఆయన మనసు మార్చుకోవడం, వేర్పాటువాదాన్ని విడనాడాలని కోరుతూ, ప్రధాని మోడీని ప్రశంసిస్తూ ఈ ఏడాది జనవరిలో మాలిక్ రాసిన లేఖతో పాటు మరో కమ్యూనిటీకి రాసిన లేఖతో ఆయన మరణం ముడిపడి వుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ కేసును కెనడా ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తు చేస్తోంది.

ఈ ఏడాది మే 29న పంజాబ్‌లో పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యకు గురికావడం వెనుక కూడా ఖలిస్తానీ గ్యాంగులు, కెనడా గ్యాంగ్‌స్టర్‌లు వున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.ఈ హత్యకు సూత్రధారిగా వున్న లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన 28 ఏళ్ల సతీందర్ జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ ప్రస్తుతం కెనడాలోనే వున్నాడు.అతన్ని భారత్‌కు రప్పించేందుకు పంజాబ్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

తాజా వార్తలు