అమెరికా : వైట్‌హౌస్ కోవిడ్ రెస్పాన్స్ టీమ్‌కి సలహాదారుగా భారత సంతతి వైద్యురాలు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్లిన భారతీయులు అక్కడ ఉన్నత పదవులు పొందుతున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా భారతీయుల శక్తి , సామర్ధ్యాలపై మంచి అభిప్రాయం వున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.

 Indian Origin Nahid Bhadelia Appointed As Senior Policy Advisor For White House-TeluguStop.com

వీరికి కీలక పదవులు కట్టబెడుతున్నారు.తాజాగా భారత సంతతికి చెందిన వైద్యురాలు నహిద్ భదేలియా అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌లోని గ్లోబల్ కోవిడ్ రెస్పాన్స్ టీమ్‌కు సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా నియమితులయ్యారు.

ప్రస్తుతం బోస్టన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న నహిద్‌ను ఈ పదవికి నియమించారు బైడెన్.

అధికారంలోకి వచ్చిన వెంటనే అమెరికాలో కోవిడ్ 19కి వ్యూహాత్మకంగా ప్రతిస్పందించడానికి బైడెన్ ఈ బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం వైట్‌హౌస్ కోవిడ్ 19 రెస్పాన్స్ కో ఆర్డినేటర్‌గా వున్న డాక్టర్ ఆశిష్ ఝా.ఈ రెస్పాన్స్ టీమ్‌కి నేతృత్వం వహిస్తున్నారు.బ్రౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో పనిచేస్తున్న ఆశిష్ .ప్రస్తుతం స్వల్పికాలిక సెలవుపై వైట్‌హౌస్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇకపోతే.భారత్‌లో జన్మించిన భదేలియా స్వీడన్, సౌదీ అరేబియాలో పెరిగారు.టీనేజ్‌లో అమెరికాకు వెళ్లారు.బోస్టన్ యూనివర్సిటీ అనుబంధ సెంటర్ ఫర్ ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ పాలసీ అండ్ రీసెర్చ్ (సీఈఐడీ) వ్యవస్థాపకురాలిగా, బోస్టన్ యూనివర్సిటీ అనుబంధ నేషనల్ ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ లాబోరేటరీస్ (ఎన్ఈఐడీఎల్)కి అసోసియేట్ డైరెక్టర్‌గానూ నహిద్ పనిచేశారు.

బోస్టన్ మెడికల్ సెంటర్‌లో ప్రత్యేక వ్యాధికారక విభాగాన్ని ప్రారంభించి అభివృద్ధి చేయడంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు.

Telugu Bhadelia Sweden, Boston, Indianorigin, Nahid Bhadelia, Joe Biden-Telugu N

ప్రాణాంతక ఎబోలా వైరస్ వ్యాప్తి సమయంలో నహిద్ పశ్చిమ, తూర్పు ఆఫ్రికా దేశాలలో పనిచేశారు.బోస్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ లైబీరియా ఎమర్జింగ్ అండ్ ఎపిడెమిక్ వైరస్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌కు కో డైరెక్టర్‌గా వ్యవహరించారు.దీనికి ఫోగార్టీ ఇంటర్నేషనల్ సెంటర్ నిధులు సమకూరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube