టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో వేణు ఉడుగుల ఒకరు.ఇతడి మొదటి సినిమా నీది నాది ఒకే కథ.2018లో వచ్చిన ఈ సినిమా మన్హసి టాక్ తెచ్చుకుంది.దీంతో ఈయనకు దగ్గుబాటి హీరోను డైరెక్ట్ చేసే అవకాశం లభించింది.
వేణు ఉడుగుల టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి తో ఇటీవలే ఒక సినిమా తెరకెక్కించిన విషయం విదితమే.రానా దగ్గుబాటి హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల తెరకెక్కించిన సినిమా విరాట పర్వం.
ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది. నక్సల్ బ్యాక్ డ్రాప్ తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్న విమర్శకుల నుండి అయితే ప్రశంసలు అందుకుంది.
ఈ సినిమా మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రానా తో సాయి పల్లవి నటించడంతో ఈ సినిమాపై ముందు నుండే అంచనాలు పెరిగాయి.
దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసారు.
అన్ని అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
కానీ కలెక్షన్స్ రాబట్టడంలో విఫలం అయ్యింది.అయితే ఈ సినిమాను తెరకెక్కించిన వేణు ఉడుగులకు మాత్రం మంచి పేరు వచ్చింది.
ఈ సినిమా నక్సల్ బ్యాక్ డ్రాప్ లో మంచి లవ్ స్టోరీగా తెరకెక్కించాడు.ఇక ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి ఈయన నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటి అని ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ రోజు వేణు పుట్టిన రోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఈయన నెక్స్ట్ సినిమాపై ఒక అప్డేట్ బయటకు వచ్చింది.వేణు తన తర్వాత సినిమాను పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించ బోతున్నట్టు తెలిపాడు.ఇప్పుడు ప్రస్తుతం కథ, స్క్రీన్ ప్లే పనులు జరుగుతున్నాయని.ఇది హీరో సెంట్రిక్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కనుందని వేణు చెప్పినట్టు తెలుస్తుంది.మరి ఈ సినిమా మొత్తం వివరాలు ఈ నెల చివరలో ప్రకటించనున్నారట.







