మైనార్టీ హిందువులే టార్గెట్.. పక్కా సమాచారంతో దాడులు..

జమ్మూ, కశ్మీర్ లో ఉగ్రవాద సంస్థలు ఎప్పటికప్పుడు వేళ్లూనుతూనే ఉన్నాయి.భద్రతాదళాలు పంజాకు మట్టికరుస్తున్న ఉగ్రవాదులు.

పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడంలేదునేది వాస్తవం.తాజాగా ఇక్కడ లష్కరే తోయీబా ఉగ్ర సంస్థ నెట్ వర్క్ నడుస్తుందన్న పక్కా సమాచారం తో భద్రతా దళాలు సెర్చ్ ప్రారంభించాయి.

కనిపిస్తే మట్టు పెట్టే దిశగా అడుగులు వేస్తున్న బీఎస్ ఎఫ్ దళాలు అనువణువునా గాలింపులు చేపట్టాయి.ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ నెట్‌వర్క్‌ను భద్రతా దళాలు ఛేదించినట్లు సమాచారం.

జమ్మూ, కశ్మీర్ లో లష్కరే తోయిబా ఉద్రవాద సంస్థ కార్యకలాపాలు మారణకాండకు కుట్రపన్నుతున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ను ఆధారం చేసుకుని, మన భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి.ముఖ్యంగా ఈ ఉగ్రవాద సంస్థకు సంబంధించి, జమ్ము, రాజౌరీ జిల్లాల నుంచి మొత్తం ఏడుగురు కీలక సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement

దీనిపై జమ్ము డివిజన్‌ అడిషనల్‌ డీజీ ముఖేశ్‌ సింగ్‌ స్పందించారు.మొత్తం మూడు లష్కరే తోయిబా బృందాలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

వీళ్లందరికీ సరిహద్దుల అవతల నుంచి వస్తున్న ఆదేశాలు పాటిస్తారు.ఈ ఉగ్రవాదులనుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు, పేలుడు పదార్థాలను స్వాధీనం భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు.

జమ్ములో అరెస్టు చేసిన లష్కరే బృందం దాదాపు రెండేళ్లుగా ఖటికా తాలాబ్‌ ప్రాంతంలో కార్యకలాపాలను నిర్వహిస్తోందని విశ్వాసనీయ వర్గాల సమాచారం.ముఖ్యంగా పాక్‌ నుంచి డ్రోన్ల ద్వారా వచ్చే ఆయుధాలను దిగుమతి చేసుకోవడం వీళ్ల ప్రధాన లక్ష్యం.

ఖటికా ప్రాంతానికి చెందిన ఫైసల్‌ మునీర్‌ అనే ఉగ్రవాదికి, పాకిస్తాన్ దోడా ప్రాంతంలోని బషీర్‌ అనే ఉగ్రవాది నుంచి ఆదేశాలు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజగా జరిగిన అరెస్టులతో రాష్ట్రంలోని మొత్తం చాలా కేసుల వివరాలు తెలియనున్నట్లు పోలీసులు తెలిపారు.జమ్ము, సాంబ, కథువా జిల్లాల్లో డ్రోన్లు ద్వారా ఆయుధాల దిగుమతికి సంబంధించి హరియా ఛక్‌ ప్రాంతంలోని హబీబ్‌ను అరెస్టు చేశారు.అతడు పలు మార్లు పాక్‌ నుంచి ఆయుధాలు అందుకొన్నట్లు అంగీకరించాడు.

Advertisement

ఫైసల్‌ మునీర్‌ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు.సమీకరించిన ఆయుధాలను జమ్ముకు చేరవేసినట్లు వెల్లడించారు.

తాజాగా అరెస్ట్ అయిన వాళ్లలో లష్కరే జిల్లా కమాండర్‌ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.ఇక రాజౌరీ జిల్లాలో లష్కరే జిల్లా కమాండర్‌ తాలిబ్‌ హుస్సేన్‌ షాను కూడా భద్రతా దళాలు అదుపులోకి తీసుకొన్నాయి.

గత మూడేళ్లుగా పీర్‌పంజాల్‌ ప్రాంతంలో చోటు చేసుకొన్న ప్రధాన ఉగ్రకార్యకలాపాల్లో ఇతడి పాత్ర ఉన్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి.మైనార్టీ హిందువులపై దాడుల్లో ఆ ఉగ్రవాది హస్తం ఉంది.

గతంలో రాజకీయ నేతలతో కలిసి తిరిగినట్లు కూడా గుర్తించారు.ఇతడి వద్ద భారీ మారణాయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు.

తాజా వార్తలు