కెనడా: నైట్ క్లబ్‌లో దుండగుల కాల్పులు.. భారత సంతతి యువకుడు మృతి

కెనడాలో దారుణం చోటు చేసుకుంది.టొరంటోలోని నైట్ క్లబ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో భారత సంతతికి చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

 Punjab Origin Man Man Shot Dead At Nightclub In Canada Toronto, Toronto Paramedi-TeluguStop.com

మృతుడిని 26 ఏళ్ల సిక్కు సంతతికి చెందిన పర్దీప్ బ్రార్‌గా గుర్తించారు.ఇతను బ్రాంప్టన్‌‌లో నివసిస్తున్నాడు.

ఈ ఘటనలో 24 ఏళ్ల యువతి కూడా గాయపడిందని.ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఆదివారం బాథర్ట్స్‌ స్ట్రీట్ సమీపంలోని 647 కింగ్ సెయింట్ డబ్ల్యూ వద్ద ఈ ఘటన జరిగినట్లు టొరంటో పోలీసులు తెలిపారు.దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున 3.33 గంటలకు సంఘటనాస్థలికి చేరుకున్నారు.టొరంటో పారామెడిక్స్ .కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బ్రార్, మరో మహిళను ఆసుపత్రికి తరలించారు.అయితే ఈ కాల్పులు జరగడానికి కారణాలు తెలియరాలేదు.

ఇకపోతే.ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ భారతీయ విద్యార్ధిని కెనడాలో ఓ ఆగంతకుడు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.టొరంటోని సెయింట్ జేమ్స్ టౌన్‌లోని షెర్‌బోర్న్ టీటీసీ స్టేషన్‌ సమీపంలోని గ్లెన్ రోడ్ ఎంట్రన్స్ వద్ద కార్తీక్‌ వాసుదేవ్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.దీంతో తీవ్ర గాయాలపాలై కుప్పకూలిన కార్తీక్‌కు ఆఫ్ డ్యూటీలో వున్న పారామెడిక్ ఒకరు ప్రథమ చికిత్స అందించి.

హుటుహుటీన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ అతను కన్నుమూశాడు.

ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడిని రిచర్డ్ జోనాథన్ ఎడ్విన్‌గా పోలీసులు గుర్తించారు.

Telugu Canada, Jitesh, Program Seneca, Pardeep Brar, Punjab, Punjaborigin, Sherb

కెనడాలో వున్న భద్రత, ఉపాధి అవకాశాల కారణంగానే తమ కుమారుడు ఆ దేశం వైపు ఆకర్షితుడైనట్లు వాసుదేవ్ తండ్రి జితేష్ పేర్కొన్నారు.అక్కడికి వెళ్లిన తర్వాత తన కుమారుడు మెక్సికన్ రెస్టారెంట్‌లో పార్ట్‌టైం ఉద్యోగం సంపాదించాడని ఆయన వెల్లడించారు.సెనెకా కాలేజీలో మార్కెటింగ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో కార్తీక్ ఎన్‌రోల్‌ చేసుకున్నట్లు ఆ కళాశాల యాజమాన్యం తెలిపింది.అతని హత్య గురించి తెలుసుకున్న సెనెకా కాలేజీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

అప్పట్లో ఈ ఘటన ఇరు దేశాల్లో సంచలనం సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube