టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసిఆర్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అంత తేలిగ్గా అర్థం కావు.ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రతి విషయంలోను పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు .
ఇక ఇప్పటికే టీఆర్ఎస్ ను రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన కెసిఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన స్కెచ్ ఇప్పటి నుంచి వేస్తున్నారు.ముఖ్యంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో సర్వేలు , నిఘా నివేదికల ఆధారంగా అభ్యర్థులు ఎంపిక చేపట్టాలని కెసిఆర్ భావిస్తున్నారట.
ఇప్పటి వరకు టిఆర్ఎస్ అభ్యర్థులకు పార్టీ బలం, కెసిఆర్ ఇమేజ్ మీద ఆధారపడి ఎక్కువ ఓట్లు పడ్డాయని , కానీ ఈసారి మాత్రం పార్టీ మాత్రమే అభ్యర్థులను గెలిపించలేదని , అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ కూడా అవసరం అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ప్రజాక్షేత్రంలో మంచి బలమున్న చురుకైన నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేస్తే విజయానికి ఎటువంటి డొకా ఉండదనేది కేసీఆర్ అభిప్రాయమట.
తెలంగాణలో సాధారణ ఎన్నికలు జరిగినా, ముందస్తు ఎన్నికలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట.అలాగే ఆపరేషన్ ఆకర్ష ద్వారా పెద్ద ఎత్తున ఇతర పార్టీలోని బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవాలని , వారిలో ప్రజాబలం ఉన్న వారికి టికెట్లు కేటాయించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట.
దీనికంటే ముందుగానే ఏఏ నియోజకవర్గాల్లో ఎవరు టిఆర్ఎస్ అభ్యర్థిగా ఉంటే విజయం దక్కుతుంది అనే విషయంపై ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీమ్ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కేసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని రిపోర్టు అందితే ఎటువంటి మొహమాటలకు వెళ్లకుండా అక్కడ అభ్యర్థిని మార్చాలని నిర్ణయించుకున్నారట.అందుకే ప్రతి నియోజకవర్గంలో నుంచి ఒకరిద్దరు నేతలను ముందుగానే గుర్తించి వారిలో ఎవరికీ విజయ అవకాశాలు ఉన్నాయని విషయం పైన సర్వే చేయించి అప్పుడు అభ్యర్థులను ఎంపిక చేయాలని కెసిఆర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.ఇప్పటికే ఐపాడ్ టీం నిర్వహించిన సర్వేలు దాదాపు 40 నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు ఉన్నాయని ఆ విభేదాలు పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తాయని నివేదికలు అందజేయటం తో ఆ గ్రూపుల మధ్య విభేదాలను తొలగించి ఐక్యంగా పార్టీ కోసం పనిచేసే విధంగా కొంతమంది కీలక నాయకులను రంగంలోకి కెసిఆర్ దింపారట.







