పిచ్చి పలురకాలు అంటారు.ఎవరిష్టం వారిది.
అయితే అది కేవలం వారినే నష్టపరచాల కానీ ఎడిటివారిని కాదు! అని అంటున్నారు ఆ వీడియో చూసిన నెటిజన్లు.అవును.
ఈమధ్య ఫుడ్ దందా ఎక్కువైపోయింది.అదికూడా కరోనా తరువాత మరీ ఎక్కువైపోయింది.
రెగ్యులర్ వంటకాలు తిని విసుగొచ్చిందేమో ఇటీవల కొందరు వినూత్న వంటకాలు ట్రై చేస్తున్నారు.కొత్త కొత్త కాంబినేషన్లతో వెరైటీ రెసిపీలు చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు.
అయితే అక్కడి వరకు బాగానే వుంది కానీ, ఈ క్రమంలో ప్రజల ఆరోగ్యం గురించి పట్టడంలేదు వీరికి.ఇక అలాంటి ఆహార పదార్ధాలను తయారుచేయడమే డేంజర్ అనుకుంటే, వాటి మేకింగ్ వీడియోలు, ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
తాజాగా అలాంటి వెరైటీ వంటకం ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది.గతంలో కూడా ఇలాంటి వీడియోలను చూసాం.అయితే ఇది కాస్త డోస్ ఎక్కువలాగా వుంది.ఓ ప్లాట్ ఫామ్ బండిమీద చాట్ తయారు చేసే వ్యాపారి ఓ కొత్త వంటకాన్ని తయారుచేసి కస్టమర్లకు రుచి చూపిస్తున్నాడు.
ఒరియా బిక్స్కెట్లు, కూల్ డ్రింక్స్ తో కలిపి ఆమ్లెట్‌ను తయారుచేశాడు.ఇతడు కోల్‌కతాకు చెందిన ఓ వీధి వ్యాపారి.
కొత్త వంటకం కావడంతో అక్కడికి పెద్దఎత్తున యువత గుమిగూడి ఆ ఆహారాన్ని కొనుక్కొని తింటున్నారు.నేటి యువతగురించి తెలిసిందే కదా.వారికి రుచులు తప్పితే ఆరోగ్యం గురించి పట్టదు.

ఇక ఈ వెరైటీ రెసిపీ యూట్యూబ్ వేదికగా ఒకరు పోస్ట్ చేసారు.దీనిని చూసిన నెటిజన్లను తెగ ఆశ్చర్యపోతున్నారు.దీనిని చూసిన ఆహార ప్రేమికులు తీవ్ర స్థాయిలో ఆ వంటకం మీద మండిపడుతున్నారు.
ఇదేం ఐడియారా బాబు, ఇది చాలా దారుణం.ఇలాంటి డిషెస్‌ను డస్ట్‌బిన్‌లో పడేయాల్సిందే.
లేదంటే మనం స్మశానానికి వెళ్లిపోతాం అంటూ కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.







