తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
అలా ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు.కాగా ఇది ఇలా ఉంటే 2017లో దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత 2020, డిసెంబర్ 10 న తేజస్విని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు దిల్ రాజు.వీరి పెళ్లి నిజామాబాదులో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా దిల్ రాజు తండ్రి అయిన సంగతి మనకు తెలిసిందే.దిల్ రాజు భార్య తేజస్విని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
అయితే వారసుల కోసం ఎదురుచూస్తున్న దిల్ రాజుకు వరసుడు పుట్టడంతో అభిమానులు నెటిజెన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు.ఇదిలా ఉంటే తాజాగా దిల్ రాజు తన వారసుడికి నామకరణం చేసినట్టు తెలుస్తోంది.
దిల్ రాజు వారసుడి పేరు అన్వి రెడ్డి అని నామకరణం చేసినట్టు తెలుస్తోంది.దిల్ రాజు మొదటి భార్య అనిత పేరు కూడా కలిసి వచ్చే విధంగా ఈ పేరుని పెట్టినట్టు తెలుస్తోంది.

అయితే ఇదే విషయంలో దిల్ రాజు భార్య తేజస్వినికీ ఎటువంటి ఇబ్బంది కూడా లేదని,సంస్కృతంలో ఆ పేరుకు ఎంత మంచి అర్థం ఉండడంతో అందుకు అడ్డు చెప్పలేక పోయిందట.దిల్ రాజు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పది సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.దిల్ రాజు తన బ్యానర్ లో పెద్ద పెద్ద సినిమాలను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.







