సంవత్సరం నుంచి రీల్స్, ఫొటోస్ కు దూరంగా ఉంటున్న వైష్ణవి చైతన్య.. కారణం అడిగితే?

ప్రస్తుతం ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా మంచి వేదికగా మారింది.ముఖ్యంగా నటీనటులు కావడానికి మాత్రం సోషల్ మీడియా ఒక మంచి ఫ్లాట్ ఫామ్ అని చెప్పాలి.

 Vaishnavi Chaitanya Staying Away From Social Media Details, Vaishnavi Chaitanya-TeluguStop.com

ఈ సోషల్ మీడియా ద్వారా తమలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టి బుల్లితెర, వెండితెరలపై అడుగు పెడుతున్నారు.ఇప్పటికే చాలామంది యూట్యూబ్ స్టార్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్నారు.

అందులో షణ్ముఖ్, దీప్తి సునయన, దీపిక పిల్లి ఇలా పలువురు యూట్యూబ్ స్టార్ లు బుల్లి తెర పై, వెండితెరపై అవకాశాలు అందుకున్నారు.ఇక వీరే కాకుండా మరో సోషల్ మీడియా స్టార్ వైష్ణవి చైతన్య కూడా మంచి సెలబ్రిటి హోదాను సంపాదించుకుంది.

మొత్తానికి సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిన వైష్ణవి చైతన్య అతి తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకుంది.

మొదట డబ్స్మాష్ వీడియోలతో పరిచయం అయ్యింది.

ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలు చేస్తూ తన అందాలతో మరింత ఆకట్టుకుంది.అలా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వైష్ణవి యూట్యూబ్ లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా నటించింది.

యూట్యూబ్ లో కూడా మంచి సక్సెస్ అందుకుంది.ఇక మోడల్ గా కూడా మంచి క్రేజ్ అందుకుంది.

Telugu Deepika Pilli, Deepthi Sunaina, Shanmukh, Software Web-Movie

అంతేకాకుండా వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంది.అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో సినిమాల్లో కూడా అల్లు అర్జున్ చెల్లెలిగా కూడా నటించి తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈమె ఎక్కువగా సాఫ్ట్వేర్ డెవలపర్ అని వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.అందులో షణ్ముఖ్ జస్వంత్ కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈమెకు యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ తో పాటు 400k సబ్స్క్రైబ్ కూడా ఉన్నారు.ఇంస్టాగ్రామ్ లో 700k ఫాలోవర్స్ ఉన్నారు.

వైష్ణవి ఎక్కువగా ఇంట్లో కంటే నెట్టింట్లో బాగా ఆక్టివ్ గా కనిపిస్తుంది.కేవలం వెబ్ సిరీస్ ల తోనే కాకుండా పలు మోడల్ కు సంబంధించిన ఫోటోలతో కూడా ఫోటో షూట్ అంటూ బాగా బిజీగా ఉంటుంది.

Telugu Deepika Pilli, Deepthi Sunaina, Shanmukh, Software Web-Movie

ఇక ఆ ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో బాగా షేర్ చేసుకుంటుంది.తన వ్యక్తిగత విషయాలతో పాటు తన ఫ్యామిలీ విషయాలను కూడా పంచుకుంటుంది.ఇక తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు కూడా పెడుతుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టింది.వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చింది.

అందులో ఓ నెటిజెన్ సంవత్సరం నుంచి ఫోటోలకు, రీల్స్ కు దూరంగా ఉంటున్నావ్ ఎందుకు అని ప్రశ్నించాడు.

దాంతో వైష్ణవి అది ఒక టాప్ సీక్రెట్ అంటూ కామెంట్ చేసింది.మరి ఆ టాప్ సీక్రెట్ ఏంటో తెలియదు కానీ ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube