ఆ జాబితాలో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు?

టీమ్ ​ఇండియా కెప్టెన్​ రోహిత్‌ శర్మ దుమ్ము దులుపుతున్నారు.తాజాగా మరో ఘనత సాధించి, చరిత్ర సృష్టించాడు.

 Rohit Sharma Is The Latest Record In That List Rohit Sharma, New Record, Viral L-TeluguStop.com

అంతర్జాతీయ T20 క్రికెట్‌లో 300 ఫోర్లు కొట్టిన 2వ ఆటగాడిగా రికార్డులకెక్కాడు.ఇంగ్లాండ్​తో జరుగుతున్న 2వ T20లో ఈ తాజా రికార్డు నమోదయ్యింది.

ఇక మొత్తంగా చూసుకుంటే, ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్​గా, టీమ్ ​ఇండియా నుంచి తొలి బ్యాటర్​గా నిలిచాడు మన రోహిత్ శర్మ.ఐర్లాండ్‌ బ్యాటర్‌ పాల్ స్టిర్లింగ్‌ 103 ఇన్నింగ్స్‌ల్లో 325 ఫోర్లతో టాప్‌లో ప్లేసులో ఉన్నాడు.

ఇపుడు రోహిత్​ రెండో స్థానంలో ఉండటం విశేషం.

భారత్​ తరఫున రోహిత్​ మొదటి స్థానంలో ఉండగా, విరాట్​ కోహ్లీ 298 ఫోర్లతో 2వ స్థానంలో నిలిచాడు.అలాగే 191 ఫోర్లతో శిఖర్‌ ధావన్‌ 3వ స్థానంలో ఉన్నాడు.2వ T20కి ముందు, రోహిత్ ఖాతాలో 118 ఇన్నింగ్స్‌ల్లో 298 ఫోర్లు, 155 సిక్సర్లు ఉన్నాయి.ఇక ఇంగ్లాండ్​తో ఆడిన 2వ T20లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు.దీంతో మొత్తం 301 ఫోర్లు కొట్టి రికార్డు సృష్టించాడు రోహిత్​.టీమ్‌ ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న 2వ T20లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జాస్‌ బట్లర్‌, బౌలింగ్‌ ఎంచుకొని టీమ్‌ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.ఇప్పటికే తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన రోహిత్‌ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.

Telugu Indian, Rohit Sharma, Ups, Latest-Latest News - Telugu

ఇకపోతే, మొదటి మ్యాచ్‌లో ఓటమి పాలైన ఇంగ్లాండ్‌, ఈ మ్యాచ్‌లో ఎలాగున్నా గెలిచి సిరీస్​లో నిలవాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.గత ఏడాది T20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత T20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో రోహిత్ శర్మ చేతికి పగ్గాలు చిక్కిన సంగతి తెలిసినదే.అప్పటి నుంచి రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ జట్టు వరుసగా న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, తాజాగా ఇంగ్లాండ్ జట్లని విజయవంతంగా చిత్తు చేసింది.దాంతో ఇపుడు అందరి దృష్టి రోహిత్ శర్మ మీదే వుంది.

ఇక రానున్న రోజుల్లో కూడా ఇంతే ఫామ్ లో ఉంటే మరిన్ని రికార్డులు నెలకొల్పడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube