నందమూరి బాలకృష్ణ మరియు మెగా స్టార్ చిరంజీవి లు టాలీవుడ్ లో టాప్ స్టార్ లు.గడచిన రెండు మూడు దశాబ్దలుగా ఇండస్ట్రీలో తమ ముద్ర కనిపించేలా చేస్తున్నారు.
మూడు దశాబ్దాల పాటు ఇలా స్టార్ హీరోలుగా ఉండటం అనేది ఏ ఒక్కరికి సాధ్యం అయ్య విషయం కాదు.ఈ ఇద్దరు హీరోల మద్య గొడవలు ఉన్నాయి అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.
ఆ వార్తల్లో నిజం ఎంతా అనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.గత కొంత కాలంగా వీరిద్దరు కలిసి అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షో లో కనిపించబోతున్నారు అనే వార్తలు వచ్చాయి.
మరో వైపు వీరిద్దరు నటించిన సినిమాలు విడుదల విషయంలో మళ్లీ పోటీ పడబోతున్నాయి.గతంలో ఖైదీ నెం.150 సినిమా తో పాటు బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి.మళ్లీ అప్పటి నుండి ఈ ఇద్దరు హీరోలకు పోటీ పడే అవకాశం రాలేదు.
పోటీ పడేంత సమయం కూడా లభించలేదు.
మళ్లీ ఇన్నాళ్లకు బాలయ్య మరియు చిరంజీవిలు ఈ దసరా సీజన్ లో తమ సినిమాలను కేవలం వారం గ్యాప్ లోనే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
ఈ రెండు సినిమాలు కూడా విడుదల విషయంలో ఒక స్పష్టత వచ్చిన తర్వాత విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వల్సి ఉంది.పెద్ద ఎత్తున అంచనాలు ఉన్న ఈ రెండు సినిమా లు కూడా ఒకే సారి విడుదల అవ్వడం వల్ల ఖచ్చితంగా అభిమానులతో పాటు బాక్సాపీస్ వద్ద కూడా కాస్త గందరగోళం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
చిరు మరియు బాలయ్య ల సినిమా లు గతంలో పోటీ పడ్డ సందర్బంలో రెండు సక్సెస్ అయిన దాఖలాలు ఎక్కువగానే ఉన్నాయి.కనుక ఈ దసరాకు కూడా రెండు సినిమా లు విడుదల అయితే ఖచ్చితంగా మంచి ఫలితాలను ఈ రెండు సినిమాలు కూడా దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.