ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్‌ ప్రకటించిన వరాలు

ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్న ప్రతి ఒక్క ఆర్టీసీ కార్మికుడిని రేపటి నుండి వచ్చి డ్యూటీలో జాయిన్‌ అవ్వాలంటూ కేసీఆర్‌ ప్రకటించాడు.49 వేల మందిలో 20 వేల మందిని ఉద్యోగాల నుండి తొలగించబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.కొన్ని రూట్లను ప్రైవేటీకరణ చేసేందుకు కూడా చర్చ జరిగింది.కాని అవేవి నిజం కాదని అందరు కూడా డ్యూటీలో జాయిన్‌ అవ్వవచ్చు అని, అలాగే రూట్లను ప్రైవేటీకరణ చేయడం కూడా నిజం కాదని, దాన్ని కూడా ఆర్టీసీ కార్మికుల కోసమే చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.

 Kcr Give The Offers To Rtc Employes-TeluguStop.com

ఇక ఆర్టీసీకి ఇప్పటికిప్పుడు ఆదుకునేందుకు వంద కోట్లు ఇస్తున్నట్లుగా ప్రకటించాడు.అలాగే చార్జీలు పెంచేందుకు కూడా అనుమతిస్తున్నట్లుగా ప్రకటించాడు.

చార్జీలు పెంచడంతో సంవత్సరంకు 750 కోట్ల వరకు ఆర్టీసీకి ఆదాయం పెరుగుతుందని అన్నాడు.ఇక సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు సాయం చేసేందుకు ముందుకు వస్తాం అన్నారు.

కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో కాని ప్రభుత్వంలో కాని ఉద్యోగం ఇస్తామంటూ హామీ ఇచ్చాడు.ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు వచ్చే బాధ్యత నాది, నా మాట వింటే ప్రతి సంవత్సరం 50 వేల వరకు బోనస్‌ కూడా తీసుకునేలా నేను చేస్తానంటూ కేసీఆర్‌ హామీ ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube