ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన గోలీమార్ సినిమాకు ఛాన్స్ వచ్చినట్టే వచ్చి పోయిందని తెలిపారు.చక్రి గారికి ఆ సినిమాకు అవకాశం దక్కిందని చక్రి గారు పూరీ జగన్నాథ్ ను డైరెక్ట్ గా కలిసి ఛాన్స్ ఇవ్వాలని కోరడంతో ఆ సినిమాకు చక్రికి ఛాన్స్ దక్కిందని రఘు కుంచె తెలిపారు.
పూరీ జగన్నాథ్ గారు సెంటిమెంట్లను ఎక్కువగా పట్టించుకోరని రఘు కుంచె చెప్పుకొచ్చారు.
పూరీ జగన్నాథ్ చక్రి కాంబినేషన్ లో తెరకెక్కిన పలు సినిమాలు హిట్లుగా నిలిచాయని రఘు కుంచె చెప్పుకొచ్చారు.
నేను పూరీ జగన్నాథ్ ను చాలాసార్లు ఛాన్స్ ఇవ్వాలని అడిగానని చివరకు దేవుడు చేసిన మనుషులు సినిమాకు నాకు ఛాన్స్ వచ్చిందని రఘు కుంచె చెప్పుకొచ్చారు.చక్రి పదిమందికి సాయం చేసే మంచి మనస్సు ఉన్న వ్యక్తి అని రఘు కుంచె పేర్కొన్నారు.
దేవుడు చేసిన మనుషులు సినిమాకు పని చేసి ఉంటే కెరీర్ పుంజుకుని ఉండేదని రఘుకుంచె చెప్పుకొచ్చారు.
కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాకు మొదట నాకు ఛాన్స్ దక్కిందని రఘుకుంచె తెలిపారు.
పవన్ సినిమాకు పని చేస్తే లైఫ్ సెట్ అయిపోతుందని అనుకున్నానని ఆయన తెలిపారు. తమ్ముడు, తొలిప్రేమ తరహా ఫ్లేవర్ తో నేను సాంగ్స్ ను సిద్ధం చేశానని రఘు కుంచె అన్నారు.
పవన్ చుట్టూ కొంతమంది పూజారులు చేరి నన్ను ఆ సినిమా నుంచి తప్పించడం జరిగిందని రఘు కుంచె తెలిపారు.

పవన్ ప్రాజెక్ట్ ను కోల్పోయిన సమయంలో నేను చాలా బాధ పడ్డానని రఘు కుంచె చెప్పుకొచ్చారు.నాకు రావాల్సిన ఛాన్స్ లు వేర్వేరు కారణాల వల్ల మిస్ అవుతున్నాయని ఆయన తెలిపారు.మంచి పాట పెద్ద హీరోకు పడితే మంచి వ్యూస్ వస్తాయని రఘు కుంచె చెప్పుకొచ్చారు.







