బాలీవుడ్ కింగ్ ఖాన్ ప్రెసెంట్ వరుస సినిమాలతో దూసుకు పోతున్నాడు.అయితే ఈయన మాత్రం కమర్షియల్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది.
షారుఖ్ ఖాన్ చేసిన సినిమాలన్నీ వరుస ప్లాప్స్ అందుకుంటున్నాయి.ఆయన చివరిసారిగా జీరో సినిమాతో వచ్చాడు అయితే ఈ సినిమాతో భారీ ప్లాప్ అందుకోవడమే కాదు జీరో సినిమాతో వచ్చి జీరో అయ్యాడు అంటూ విమర్శలు సైతం ఎదుర్కొన్నాడు.
ఈ సినిమా దెబ్బతో కింగ్ ఖాన్ ఏకంగా 4 ఏళ్ల గ్యాప్ ఇచ్చి మరీ ఇప్పుడు పఠాన్ సినిమాతో రాబోతున్నాడు.అయితే షారుఖ్ పఠాన్ సినిమాతో పాటు మరొక సినిమా కూడా చేస్తున్నాడు.
కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో నయనతార బాలీవుడ్ లోకి అడుగు పెడుతుంది.
మొదటిసారి ఈమె ఈ పాన్ ఇండియా సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది.
అంతేకాదు దీపికా పదుకొనే కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో నటించనున్నట్టు సమాచారం.
మరి పఠాన్ కంటే కూడా జవాన్ సినిమా పైనే ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.దీంతో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ కాక ముందే ఓటిటి భారీ డీల్ తో ముందుకు వచ్చినట్టు టాక్.
నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమాను ఏకంగా 120 కోట్ల రూపాయలు చెల్లించి మరీ హక్కులు సొంతం చేసుకున్నట్టు టాక్.

మరి షారుఖ్ ఖాన్ మూవీ 100 కోట్లు రాబట్టడమే కష్టం అంటే ఓటిటి డీలింగ్ తోనే ఏకంగా 120 కోట్లు చెల్లించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.దీంతో ఈయన స్థాయి ఎంత అనేది అందరికి అర్ధం అవుతుంది.నెట్ ఫ్లిక్స్ వారు సినిమా అద్భుతంగా ఉంటుంది అని నమ్మి అన్ని కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చారు.
మరి ఈయన క్రేజ్ ఏంటో ఈ సినిమా ఎంత వసూళ్లు చేస్తుందో ఈ సినిమాతో తేలిపోతుంది.
ఇక ఈ సినిమాలో షారుఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.
ఇందులో సౌత్ కు సంబంధించిన స్టార్స్ నటిస్తుండడంతో ఇక్కడ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.మరి షారుఖ్ ఖాన్ దశాబ్దం తర్వాత అయినా కమర్షియల్ హిట్ సాధిస్తాడా లేదా అనేది చూడాలి.







