తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రష్మీకి ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందొ మనందరికి తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు కేవలం ఎక్స్ ట్రా జబర్దస్త్ షో కి మాత్రమే యాంకర్ గా వ్యవహరించి రష్మి ప్రస్తుతం జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్ రెండు షోలకి యాంకర్ గా వ్యవహరిస్తోంది.ఈ షోతో పాటుగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది.
శ్రీదేవి డ్రామా కంపెనీకి షోకి యాంకర్ గా వ్యవహరిస్తున్న సుధీర్ వెళ్లిపోవడంతో ఆస్థానంలోకి రష్మి తీసుకువచ్చారు.
అయితే సుధీర్ లేని లోటును ఎవరు తీర్చకపోయినప్పటికీ రష్మీ మాత్రం తన యాంకరింగ్ తో బాగానే నెట్టుకొస్తోంది.
అయితే శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో సుధీర్ లేకపోయినప్పటికీ సుధీర్ పై పరోక్షంగా కౌంటర్లు వేస్తూనే ఉన్నారు.బాబు అంటూ ఆది, రాం ప్రసాద్ ఇద్దరూ కూడా రష్మీని ఏడిపిస్తున్నారు.
సుధీర్ రష్మీ ట్రాక్‌ను పరోక్షంగా వాడేస్తు రష్మీ పై పదేపదే సెటైర్లు వేస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి షోకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు.
ఇక ఆ వీడియోలో ఆషాడం కదా? భార్యభర్తలు ఒక చోట ఉండొద్దని అని అంటుంది రష్మీ.

ఇంతలోనే వర్ష రష్మీపై అక్క ఆషాడం కదా నువ్ ఇక్కడున్నావ్.బావ అక్కడున్నాడు అంటూ రష్మీ మీద వర్ష కౌంటర్లు వేసేందుకు ప్రయత్నించగా వెంటనే రష్మీకి చిర్రెత్తుకొచ్చి ఎవరే నీకు అక్కా.ఎవరే నీకు అక్కా.
వెళ్లి కూర్చో అంటూ వర్ష మీదకు రావడంతో ఇక వెంటనే హైపర్ ఆది రష్మీ అంటూ తీయగా పిలవగా హా ఏంటి అంటూ రష్మీ కాస్త గట్టిగా అడిగగా, వెంటనే హైపర్ ఆది అందరికీ ఆషాడం నెల నెల రోజులు ఉంటే.కానీ మీకు మాత్రం ఓ ఏడాది ఉండేలా కనిపిస్తోందంటూ ఆది పంచ్ వేయడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ఉంటారు.

అయితే హైపర్ ఆది అన్న మాటలను బట్టి చూస్తే రష్మీ, సుధీర్ ఇద్దరూ ఇంకో ఏడాది వరకు ఏ షోలోనూ కనిపించకపోవచ్చు అన్న విషయం అర్థం అవుతోంది.అయితే మరి హైపర్ ఆది ఆ ఉద్దేశంతోనే డైలాగ్ వేశాడా లేకపోతే.కామన్ గా డైలాగ్ వేశాడా అన్నది తెలియాల్సి ఉంది.అలా సుడిగాలి సుదీర్ లేకపోయినా కూడా ఆ మొత్తం ఎపిసోడ్లో కనీసం రెండు మూడు సార్లు అన్న సుధీర్ ని తలుచుకుంటూ ఉంటారు.
అంతేకాకుండా సుధీర్ పై స్కిట్లు చేస్తూ సుదీర్ పై ఇండైరెక్ట్ గా పంచులు కూడా వేస్తూ ఉంటారు.







