షూటింగ్ పూర్తి చేసుకున్న" ద్రౌపది"( నాకు కూడా ఐదుగురే )

చతుర శ్రీ సమర్పించు శ్రీ సంతోషి మా క్రియేషన్స్, శ్రీశ్రీశ్రీ మహమ్మాయి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం “ద్రౌపది” తిన్నామా పడుకున్నామా తెల్లారిందావంటి హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రామ్ కుమార్ నేతృత్వంలో సాక్షి ప్రధాన పాత్రలో నూతన నిర్మాత బొడ్డుపల్లి బ్రహ్మచార్య నిర్మిస్తున్న ద్రౌపది చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

 draupadi Movie Completed Shooting. Draupadi, Tollywood, Ram Kumar , Boddupall-TeluguStop.com

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ పూర్తి కమర్షియల్ వ్యాల్యూ తో రూపొందించిన లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు ఇది ద్వాపర యుగములో అప్పటి పరిస్థితులను బట్టి ద్రౌపతి జీవన విధానం అందరికీ తెలిసిందే ఇప్పటి ఈ కలియుగంలో ఓ స్త్రీ ద్రౌపతిగా ఎలా మారింది ఆమె అలా మారటానికి ప్రేరేపించిన పరిస్థితి ఏంటి అనేది ఈ చిత్ర కథాశం .

ఈ చిత్రంలో మూడు పాటలు ఉంటాయి ఈ చిత్రంలో మంచి మెసేజ్ ఉంటుంది అలాగే యూత్ కి కావలసిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి.ఈ కథను చెప్పగానే నన్ను వెన్నంటి ప్రోత్సహించిన మా ప్రొడ్యూసర్ బ్రహ్మచార్య గారిని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను .ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్నాము.త్వరలో ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేయనున్నాం సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నాం అని అన్నారు.

ఈ సందర్భంగా బొడ్డుపల్లి బ్రహ్మచర్య మాట్లాడుతూ రామ్ కుమార్ గారు ఈ కథ చెప్పిన వెంటనే నన్ను ఎంతో ఆలోచింపజేసింది అందుకే వెంటనే ఎస్ చెప్పి షూటింగ్ స్టార్ట్ చేసాము.రామ్ కుమార్ తను చెప్పిన విధంగానే ఈ కథను అద్భుతంగా మలిచాడు .రామోజీ ఫిలిం సిటీలో పాటలు చిత్రీకరించాం.అలాగే షూటింగ్ను జగిత్యాల, హైదరాబాదు, పోచంపల్లి వంటి తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరించాం .ఈ చిత్రం డిఫనెట్ గా మాకు మా బ్యానర్ కు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు.సాక్షి (తొలి పరిచయం ),రాజేంద్ర ,దేవి శ్రీ, శ్రావణ భార్గవి, ఇందిరాల శ్రీనివాసచారి ,బొడ్డుపల్లి అభిజిత్, వర్షిత్, వీక్షిత్, మోక్షజ్ఞ, సిరికొండ అరుష్, మోక్షిత మోక్షజ్ఞ ,తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: జయ సూర్య, రవి ములకలపల్లి, ఎడిటర్ :వి నాగిరెడ్డి, పి ఆర్ ఓ: బి వీరబాబు,సహ నిర్మాతలు: బొడ్డుపల్లి సంతోష్.సంపత్.సంకిర్త్, నిర్మాత: బొడ్డుపల్లి బ్రహ్మచార్య, కథ, రచన, దర్శకత్వం :రామ్ కుమార్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube