అల్లూరి జయంతి వేడుకలలో చిరు..గజమాలతో స్వాగతం పలికిన అభిమానులు!

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు కావడంతో నేడు భీమవరంలో ఆయన విగ్రహావిష్కరణ జరిగింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగడంతో ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరయ్యారు.

ఇకపోతే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నరేంద్ర మోడీ మొదటిసారిగా వేదిక పంచుకున్నారు.అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల కోసం భీమవరం వెళ్లిన మెగాస్టార్ చిరంజీవికి రాజమండ్రి అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ఘనస్వాగతం లభించింది.

నేడు ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు పెద్ద ఎత్తున గజమాలతో స్వాగతం పలికారు.చిరంజీవి అభిమానులకు అభివాదం చేస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలారు.

ఇకపోతే అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి చిరంజీవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

భీమవరంలో అల్లూరి సీతారామరాజు 3 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాల పైన దృష్టి పెట్టారు అయితే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో భాగంగా పలువురికి ఆహ్వానాలు అందిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి సైతం ఆహ్వానం రావడంతో ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు