కేసిఆర్ పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సీరియస్ కామెంట్స్..!!

హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసింది.ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు.

ఇంకా బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావడం జరిగింది.అయితే ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చిన సమయంలో.

స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు కావడంతో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ప్రధాని వస్తే స్వాగతించడానికి ముఖ్యమంత్రి రాకపోవడం నిజంగా రాజ్యాంగాన్ని అవమానించటమేనని మండిపడ్డారు.

కేసిఆర్ ఒక నియంత అని సీరియస్ అయ్యారు.రాజ్యాంగపరమైన సాంప్రదాయాలనే కాదు సంస్కృతపరమైన సాంప్రదాయాలను కూడా ఉల్లంగిస్తున్నారని విమర్శించారు.కేసిఆర్ కుటుంబానికి రాజకీయాలంటే ఒక సర్కస్.

Advertisement

కానీ బీజేపీకి జాతీయ విధానం.తెలంగాణలో రాచరికపు పోకడలు కనిపిస్తున్నాయి.

భారత్ లో ఇది ఎంత మాత్రం అనుసరణీయం కాదు అంటూ స్మృతీ ఇరానీ తనదైన శైలిలో.సీఎం కేసీఆర్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు