స్టార్ హీరో కోసం పోటీ పడుతున్న యంగ్ బ్యూటీస్.. ఎవరంటే?

టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే.

ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే.

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20 వ తేదీన ఈ సినిమా డైలాగ్ మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్.ఆ మోషన్ పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది.

ఇకపోతే కొరటాల శివ,జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని నిర్మించబోతున్నారు.ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు హీరోయిన్ కొరత ఏర్పడిందని తెలుస్తోంది.ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన విడుదల అయిన తర్వాత ఇందులో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ నటించబోతోంది అని ప్రచారం జరిగింది.

Advertisement

కానీ ఆలియాభట్ వివాహం జరిగి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది.ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్స్ జాన్వీకపూర్, శ్రద్ధా కపూర్, కృతి సనన్, దిశా పటాని లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా మరొక ఇద్దరు కన్నడ ముద్దుగుమ్మల పేర్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.ఉప్పెన సినిమాతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న కృతి శెట్టి, పెళ్లి సందడి సినిమా తో యూత్ ని ఆకట్టుకునేలా శ్రీ లీల. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రస్తుతం తెలుగులో వరుస ప్రాజెక్టులు లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.వీరిద్దరిలో ఒకరు ఎన్టీఆర్ 30 ఓ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఇద్దరిలో ఒకరు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.ఇక మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్స్ ని తీసుకోబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు