ఇస్కాన్‌తో ఒప్పందం చేసుకున్న IRCTC.. ప్రయాణికులకు ఇకనుండి మంచి ఆహారం లభించనుంది!

రైలులో సుదూరాలు ప్రయాణించేవారు భోజనం చేయవలసినపుడు కాస్త అసౌకర్యాన్ని ఫీల్ అవుతూ వుంటారు.ఎందుకంటే అక్కడ లభించే ఆహారం ఎలా ఉంటుందో ఇక్కడ ప్రస్తావించాల్సిన పనిలేదు.

 Irctc Contracted With Iskcon-TeluguStop.com

ఒక్కోసారి ట్రైన్లో లభించే ఆహారాన్ని తినేవారు మరలా రెండోసారి కావాలని అనరు.అంత దారుణంగా అక్కడి ఆహారపదార్ధాలు వుంటాయని అందరికీ తెలిసిందే.

అయితే ఈ విషయంలో ప్రయాణికులకు IRCTC ఓ శుభవార్త చెప్పింది.వారికి శాకాహారం అందించడం కోసం ఇస్కాన్‌తో తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది.

దీంతో ఇస్కాన్ టెంపుల్‌కు సంబంధించిన గోవిందా రెస్టారెంట్ నుంచి ఇకనుండి ఫుడ్ అందించనున్నారు.

రైలు లోపల నుండే ఈ ఆహారానికి ఆర్డర్ ఇవ్వవచ్చు.

పూర్తిగా శాకాహారం ఇక్కడ లభించనుంది.సాత్విక ఆహార మెనులో డీలక్స్ థాలీ, పురాణి ఢిల్లీ వెజిటబుల్ బిర్యానీ, మహారాజా థాలీ, వెజిటేబుల్ డిమ్ సమ్, పనీర్ డిమ్ సమ్, దాల్ మఖానీ తదతర వెరైటీస్ కూడా ఇందులో లభించనున్నాయి.

IRCTC, ఇస్కాన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.మొదటి దశలో ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుండి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది.

త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న ఇతర స్టేషన్లలో కూడా దీన్ని ప్రారంభించే అవకాశం లేకపోలేదు.

Telugu Train, Irctc, Iskcon, Iskcon Temple, Vegetarian-Latest News - Telugu

దూర ప్రయాణాలు చేసే సందర్భాల్లో ముఖ్యంగా శాకాహారం తినే ప్రయాణికుల ఆహారం విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో IRCTC ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.ప్రయాణికులు IRCTC ఇ-క్యాటరింగ్ వెబ్‌సైట్ లేదా IRCTC యాప్ ద్వారా ఈ ఫుడ్ ని బుక్ చేసుకోవచ్చు.ఇకపోతే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సంబంధించి IRCTC ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఎవరైనా ఫ్యామిలీ మొత్తం కలిసి ఎక్కడైనా రైల్లో ప్రయాణం చేద్దామంటే ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్ కోసం ఇప్పటి వరకు 2 లేదా 3 యూజర్‌ ఐడీలు ఉపయోగించాల్సిన పరిస్థితి.ఆధార్‌ అనుసంధానం చేసిన యూజర్‌ ఐడీ ద్వారా ప్రస్తుతం 12 టికెట్ల వరకు బుక్‌ చేసుకునేందుకు అనుమతి ఉంటే ఇపుడు ఆ పరిమితిని 24 వరకు పెంచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube