బ్రిటీష్ దిగ్గజ సంస్థ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (సీఈవో) భారత్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది సంతోష్ శుక్లా నియమితులయ్యారు.సుప్రీంకోర్ట్ లాయర్‌గా ఆయన భారతీయులందరికీ సుపరిచితుడే.
ఇటీవలే సంస్థ సెంట్రల్ వర్కింగ్ కమిటీ ఆయనను సీఈవోగా నియమించింది.వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇటీవలే తన ఐదేళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది.
రాబోయే ఐదేళ్లలోనూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందిస్తోంది.
సీఈవో హోదాలో యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఐయుడెక్స్ ఇంటర్నేషనల్ అనుబంధ ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేషన్ వ్యాపార కార్యకలాపాలను ఆయన నిర్వహిస్తారు.
అలాగే ఆసియా దేశాలలో వ్యాపార విస్తరణపై దృష్టి సారించనున్నారు.శుక్లా తన పాత్ర గురించి మాట్లాడుతూ.
ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో సామర్ధ్యాన్ని పెంపొందించే సంచికలను ప్రచురించడంతో పాటు 75కి పైగా దేశాలలో సంస్థ తన ఉనికిని చేరుకుంటుందని ఆకాంక్షించారు.గడిచిన ఐదేళ్లలో ప్రపంచంలోని 25 దేశాలలో తమ సంస్థ బలమైన ఉనికిని చాటుకుందన్నారు.
ఇది ప్రపంచవ్యాప్తంగా 1000 మంది వ్యక్తులను సత్కరించినట్లు సంతోష్ శుక్లా పేర్కొన్నారు.

శుక్లా సైబర్ లా నిపుణుడు, టెక్నికల్ రైటర్, సౌత్ ఆసియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎస్ఏసీసీఐ) డైరెక్టర్ జనరల్‌గా, ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేషన్ ప్రెసిడెంట్ అండ్ సీఈవోగా, అల్మా వరల్డ్ ప్రెసిడెంట్, అల్మా టుడే, అల్మా టైమ్స్, డబ్ల్యూబీఆర్ న్యూస్ చీఫ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కొత్త సీఈవోగా నియమితులైన సంతోష్ శుక్లాకు ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయులు, కార్పోరేట్ సమాజం అభినందనలు తెలియజేస్తోంది.








