ఏడాది క్రితం జరిగిన భారత సంతతి వ్యాపారవేత్త హత్య, దోపిడీ కేసును అమెరికా పోలీసులు ఛేదించారు.దీనికి సంబంధించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
న్యూయార్క్‌లోని లిండెన్‌హర్ట్స్‌కు చెందిన కిన్‌షుక్ పటేల్ అనే వ్యక్తిని తన సొంత స్టోర్‌లోనే కత్తితో నరికి చంపి, ఆపై నగదును దోచుకెళ్లారు దుండగులు.ఏడాది తర్వాత ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డబ్ల్యూసీబీఎస్ టీవీ గురువారం కథనాన్ని ప్రసారం చేసింది.
దీనిపై కిన్‌షుక్ పటేల్ బంధువు సంజయ్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ.డిటెక్టివ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
నిందితుడు అట్జ్‌మోన్ వేలిముద్రలు, డీఎన్ఏ రిపోర్ట్, కిన్‌షుక్ పటేల్ దుకాణంలోకి ప్రవేశించిన సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించినట్లు పోలీసులు తెలిపారు.33 ఏళ్ల కిన్‌షుక్ పటేల్‌కు 18 నెలలు, ఐదేళ్లు వున్న ఇద్దరు కుమారులు, భార్య రుచికా పటేల్ వున్నారు.ఘటన జరిగిన రోజున తన భర్త ఎంతకీ ఇంటికి రాకపోవడంతో డాపర్ స్మోక్ షాప్ వద్దకు వెళ్లింది.అక్కడి దృశ్యాలు చూసి ఆమె ఖంగుతింది.
నిందతుడు అట్జ్‌మోన్‌ను కోర్టులో హాజరుపరచగా.అతను ఆందోళనగా కనిపించాడు.నేరానికి సంబంధించి బెయిల్ లేకుండా.మానసిక వైద్యుల పర్యవేక్షణలో వుంచాల్సిందిగా న్యాయమూర్తి అధికారులను ఆదేశించారు.దీనిపై రుచికా పటేల్ స్పందిస్తూ.అతన్ని జీవితాంతం జైలులోనే వుంచాల్సిందిగా కోరారు.

కాగా.అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.కార్యాలయాల్లో, పని ప్రదేశాల్లో జరిగే హింసకు సంబంధించి రిటైల్ ఉద్యోగం అత్యంత ప్రమాదకరమైనది.స్టోర్లు, గ్యాస్ స్టేషన్లు, లిక్కర్ షాపుల్లో భౌతిక దాడులు, హత్యలు, దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపింది.
మరోవైపు అమెరికాలో హింసాత్మక నేరాలు పెరుగుతున్నాయి.ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలోనే నరహత్యలు 2019తో పోలిస్తే 2021లో 58 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.







