ఈ రోజుల్లో హీరోయిన్ అంటే అందాల ప్రదర్శన అనే అంతా భావిస్తున్నారు.వారు కూడా తమ అందాలను ఎర వేసి ఆఫర్స్ అందుకుంటున్నారు.
ఇలా అందాల ప్రదర్శన లేకుండా సినిమాలు చేసే వారు ఎవరో ఒకరు ఉన్నారు.అందరూ కూడా అందాల ప్రదర్శనకే మొగ్గు చూపిస్తున్నారు.
దీంతో రోజురోజుకూ సినిమాల్లో హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ ఎక్కువ చేస్తున్నారు.
ఏకంగా బికినీ ట్రీట్ ప్రేక్షకులకు అందిస్తున్నారు.
అయితే యూత్ అట్రాక్ట్ అవుతున్న ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం అలాంటి సినిమాలను భార్య పిల్లలతో చూడడానికి సంకోచిస్తున్నారు.ఈ క్రమంలోనే బికినీ పై ఒక యంగ్ హీరోయిన్ ఘాటు కామెంట్స్ చేసింది.
ప్రముఖ దర్శకనిర్మాత ఎం ఎస్ రాజు తెరకెక్కించిన 7 డేస్ 6 నైట్స్ సినిమా జూన్ 24న రిలీజ్ అవ్వనుంది.
ఈ సినిమాలో సుమంత్ అశ్విన్-మెహర్ చాహల్, రోహన్-కృతిక శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు.
ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రొమోషన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే మెహర్ చాహల్ తన పాత్ర గురించి చెప్పుకొచ్చింది.
ఈ సినిమా మొత్తం యువకుల చుట్టూ తిరుగుతుంది.గోవాలో ఒక రెస్టారెంట్ లో పనిచేసే సాధారణ అమ్మాయి పాత్రలో తాను నటించానని తెలిపింది.

యువత మాత్రమే కాదు కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయగలరు.ఇది బోల్డ్ సినిమా కాదు.స్విమ్ సూట్ వేసుకోవడం వల్ల బోల్డ్ అని అర్ధం కాదు.అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏవీ ఇందులో ఉండవు.అంటూ బికినీ పై కామెంట్స్ చేయగా అవి కాస్త వైరల్ అయ్యాయి.ఈమె ప్రభాస్, రానా దగ్గుబాటి, తమన్నా, ధనుష్ సినిమాలు చూసిందని చెప్పుకొచ్చింది.