సికింద్రాబాద్ రైల్వే ఘటన ఎఫెక్ట్ హైదరాబాద్ మెట్రో సర్వీస్ లు రద్దు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.దాదాపు కొన్ని రైళ్లకు నిప్పంటించారు.

 Secunderabad Railway Incident Effect Hyderabad Metro Services Canceled Details,-TeluguStop.com

దీంతో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది.హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయడం జరిగింది.

ఇదే సందర్భంలో హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ కూడా అప్రమత్తమైంది.ముందు జాగ్రత్త లో భాగంగా మెట్రో రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపి వేసినట్లు స్పష్టం చేయడం జరిగింది.

తదుపరి సమాచారం వచ్చేవరకు 3 లైన్ లలో అన్ని మెట్రో రైలు నడపబోమని పేర్కొన్నారు.ఇక ఇదే సమయంలో విజయవాడ ఇంకా విశాఖపట్టణంలో కూడా అదనపు బలగాలను రైల్వే స్టేషన్ లలో దింపి ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.

పరిస్థితి ఇలా ఉంటె ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు.ఆర్మీ నియామకాల అధికారి తమ వద్దకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోపక్క పోలీసులు చర్చలు జరుపుతున్నారు.ఆందోళనకారుల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆర్మీ నియామకాల అధికారం రావాలని డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube