ఈ రక్తపు ఆటలు ఏంటి నెల్సన్‌.. స్టార్‌ డైరెక్టర్ పై ట్రోల్స్‌

ఈమద్య కాలంలో తమిళంలో టాప్ స్టార్‌ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న నెల్సన్‌ దిలీప్ ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ తో సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ సినిమా నుండి నేడు కీలక అప్డేట్ ను ఇచ్చారు.

 Rajinikanth And Nelson Dilip Movie Title Poster , Film News , Nelson Dilip ,-TeluguStop.com

ఎప్పుడెప్పుడు సినిమా టైటిల్‌ ను రివీల్‌ చేస్తారా అంటూ ఎదురు చూసిన వారి కోసం అన్నట్లుగా నేడు నెల్సన్‌ దిలీప్ టైటిల్‌ ను రివీల్ చేసేందుకు పోస్టర్స్ ను విడుదల చేయడం జరిగింది.ఈ సినిమా ను తమిళంతో పాటు అన్ని భాష ల్లో విడుదల చేయబోతున్నారు.

కనుక అన్ని భాషలకు సెట్‌ అయ్యే విధంగా ‘జైలర్‌’ ను ఖరారు చేశారు.టైటిల్‌ బాగానే ఉంది కాని దాన్ని చూపించిన తీరు పైనే విమర్శలు వస్తున్నాయి.

దర్శకుడు నెల్సన్ దిలీప్ కు మంచి దర్శకుడు అనే పేరు ఉండనే ఉంది.అయినా కూడా ఆయన తన రక్తపాతం మార్క్ ను మాత్రం వదిలేయడం లేదు.

గతంలో నెల్సన్‌ దిలీప్ చేసిన దాదాపు అన్ని సినిమాల టైటిల్స్ మరియు పోస్టర్స్ ఖచ్చితంగా రక్తంతో తడిసి ముద్ద అయ్యాయి.గత చిత్రం మాస్టర్ లో ఏ స్థాయి లో హీరో విజయ్‌ మీద రక్తం ఉంటుందో అందరికి తెల్సిందే.

అన్ని సినిమా ల్లో రక్త పాతం ఉంటుంది.కాని నెల్సన్ దిలీప్‌ సినిమా ల యొక్క పోస్టర్స్ లోనే ఎక్కువ రక్తపాతం ఉంటుంది.సినిమా లో రక్తపాతం తక్కువే అయినా కూడా పోస్టర్ లో మాత్రం మోతాదుకు మించి హింస ను దర్శకుడు చూపిస్తాడు అనేది చాలా మంది అభిప్రాయం.ఈ సినిమా లో కూడా రజినీకాంత్‌ ను చక్కగా చూపిస్తాడు అనే నమ్మకం ఉంది.

కాని రక్తపు మరకలు మాత్రం చాలా కామన్‌ గా ఉన్నాయంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube