టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈయన దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా విడుదలై పాన్ ఇండియా లెవెల్ లో కొత్త రికార్డులు సృష్టించింది.ఇక ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 సినిమా పనులతో బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం రౌడీ బాయ్స్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు వారసుడిగా.
రౌడీ బాయ్స్ సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆశిష్ రెడ్డి తన మొదటి సినమా ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.ఈ సినిమాలో బాధ్యత తెలియని ఒక స్టూడెంట్ పాత్రలో ఆశిష్ నటించాడు.
ఈ సినిమాలో ఆశిష్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది.ఇక ఈ సినిమా తర్వాత ఆశిష్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.
ప్రస్తుతం కాశి విశాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సెల్ఫిష్ సినిమాలో నటిస్తున్నాడు.
ఇటీవల ఆశిష్ సోషల్ మీడియా ద్వారా డైరక్టర్ సుకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేశాడు.

సుకుమార్ తో కలిసి క్లోజ్ గా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయన గురించి ఇలా రాసుకొచ్చాడు.” సెల్ఫిష్ సినిమాకు మీ గొప్ప ఇన్ పుట్స్, మాటలు అందించడమే కాకుండా సినిమా బాధ్యతను భుజాల మీద వేసుకొని.సినిమాని పర్యవేక్షిస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు సుక్కూ అన్న.సెల్ఫిష్ త్వరలోనే మీ ముందుకొస్తుంది….అంటూ విశాల్ కాశి, సుకుమార్‌తో దిగిన ఫోటో షేర్ చేశాడు.ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సెల్ఫిష్ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దిల్ రాజు, సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు.







