విరాటపర్వం సినిమా వీకెండ్ లో కూడా అదే పరిస్థితి

సాయి పల్లవి హీరోయిన్ గా రానా కీలక పాత్ర లో నటించిన విరాట పర్వం సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యం లో దాదాపుగా 12 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా కు మొదటి రోజు కోటి రూపాయల వసూళ్లు కూడా రాకపోవడంతో అంతా షాక్‌ అయ్యారు.

 Rana And Sai Pallavi Movie Virata Parvam Collections , Flim News, Movie News, Ra-TeluguStop.com

సినిమా లాంగ్ రన్ లో కనీసం అయిదు కోట్ల వసూళ్లు కూడా నమోదు చేస్తుందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తే మరి కొందరు మాత్రం సినిమా వీకెండ్స్ లో తప్పకుండా పుంజుకుంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేశారు.శని మరియు ఆది వారాల్లో కూడా పరిస్థితి అలాగే ఉందంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.

విరాటపర్వం సినిమా మొదటి వీకెండ్‌ పూర్తి అయ్యేప్పటికి కనీసం అయిదు కోట్లు కూడా రాబట్టే పరిస్థితి కనిపించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.శని ఆది వారాల్లో కూడా వసూళ్లు రాకుంటే వీక్‌ డేస్ ల్లో ఇంకా దారుణంగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.

మొత్తంగా ఈ సినిమాకు 12.5 కోట్ల రూపాయల బ్రేక్‌ ఈవెన్ టార్గెట్‌ ఉంది.కాని ఈసినిమా మాత్రం కనీసం 5 నుండి 6 కోట్ల ను కూడా రాబట్టే అవకాశాలు లేవు అంటూ టాక్‌ వినిపిస్తుంది.సినిమా కు చాలా పాజిటివ్ టాక్ వచ్చింది.

అయినా కూడా వసూళ్లు మరీ ఇంత తక్కువగా నమోదు అవుతుండటం ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సాయి పల్లవి ని లేడీ పవర్ స్టార్‌ అంటున్నారు.

ఈ సమయంలో ఆమె నుండి వచ్చిన సినిమా అవ్వడం వల్ల ఖచ్చితంగా ఓ రేంజ్ వసూళ్ల ను నమోదు చేస్తుందని అంతా భావించారు.కాని అంచనాలు తారు మారు అయ్యాయి.

విరాటపర్వం సినిమా కోసం మూడు సంవత్సరాలు వెయిట్ చేసిన వారు కొందరు థియేటర్ల బాట పడుతున్నారు.కాని కొందరు మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు అంటూ సినిమా కు దూరంగా ఉంటున్నారు.

రానా మరియు సాయి పల్లవి ల కోసం మరియు ఒక మంచి దృశ్య కావ్యం అని ఈ సినిమా ను చూడవచ్చు అంటూ సినిమా ను చూసిన వారు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube