అభినవ కృష్ణ అలియాస్ అదిరే అభి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నటువంటి అభి నటనపై ఆసక్తి ఉండటంతో ఈయన బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయం అయ్యారు.
ఈ కార్యక్రమంతో అదిరే అభి అనే గుర్తింపు సంపాదించుకున్న ఇతను ఏకంగా వెండితెర సినిమా అవకాశాలను అందుకొని వరుస సినిమాలలో నటిస్తున్నారు.ఇలా ఆయన మొట్టమొదటిసారిగా ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ పాత్ర ద్వారా వెండితెర అరంగేట్రం చేశారు.
ఈ విధంగా వెండితెర సినిమాలలో నటిస్తూనే బుల్లితెర కార్యక్రమాల ద్వారా సందడి చేస్తూ విపరీతమైన అభిమానులను సంపాదించుకున్నారు.ప్రస్తుతం అదిరే అభి జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ స్టార్ మా లో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
అదేవిధంగా మరోవైపు వెండితెర సినిమాలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే అభి బి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగులో పాల్గొన్నారు.

ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఒక యాక్షన్ సన్నివేశం తెరకెక్కించే సమయంలో అభి ప్రమాదానికి గురైనట్లు సమాచారం.ఈ క్రమంలోనే తన చేతికి 15 కుట్లు పడ్డాయని చిత్ర బృందానికి సంబంధించిన ఒకరు తెలియజేశారు.అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు.
ఇలా అదిరే అభి ప్రమాదానికి గురయ్యారని తెలియడంతో అభిమానులు కాస్త కంగారు పడినప్పటికీ ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.







