సూర్యాపేట జిల్లా:పెంచిన ఛార్జీలను,బస్ పాస్ చార్జీలను తగ్గించి,ప్రతి విద్యార్థిని,విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులు ఇచ్చి,ప్రతి గ్రామానికి విద్యార్థుల సమయ అనుకూలంగా బస్సులను నడపాలని సూర్యాపేట జిల్లా కేంద్రంలో పీ.డి.
ఎస్.యు ఆధ్వర్యంలో నిరసన చెప్పట్టారు.ఈ సందర్భంగా పీ.డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలేబొయిన కిరణ్ మాట్లాడతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు చార్జీలను ఇప్పటికే ఒక నెలలో రెండుసార్లు పెంచినప్పటికీ తిరిగి మళ్లీ పెంచడం విద్యార్థులకు పెను భారంగా మారిందని అన్నారు.ఎమ్మెల్యేలకు,ఎంపీలకు,మంత్రులకు విచ్చలవిడిగా నెలవారీ జీతాలు పెంచుకునే అన్ని అలవెన్సులు పొందుతూ ఏసీ జీవితాన్ని గడుపుతున్నారని మా ఓట్లతో ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు దర్జా జీవితం గడుపుతున్నారని ఓటు వేసిన పాపానికి మాకు మాత్రం నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్,డీజిల్ బస్ చార్జీలు,చివరికి బస్ పాస్ చార్జీలను కూడా పెంచి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలను చదువులకు దూరం చేస్తున్నారని ఆయన అన్నారు.రెక్కాడితే డొక్కాడని మా తల్లిదండ్రుల పరిస్థితి ఈ ప్రభుత్వాలకు అర్థం కావట్లేదని,కూలినాలి చేసి మాకు బస్ పాసులు ఇప్పిస్తే ఇప్పుడు బస్ పాస్ చార్జీలు పెరగడంతో ఇక మేము చదువులకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని పెంచిన ఛార్జీలను బస్ పాస్ చార్జీలను తగ్గించి,ప్రతి విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా బస్ పాసులు ఇచ్చి,ప్రతి గ్రామానికి విద్యార్థులు సమయానుకూలంగా బస్సులను నడపాలని అన్నారు.
లేని యెడలలో త్వరలోనే రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఇంటిని ముట్టడించి,పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నితిన్,పవన్,సాయి,రాజేష్,మహేష్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.