భారతీయ చలనచిత్ర పరిశ్రమలో హాలీవుడ్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది అన్న విషయం తెలిసిందే.ఎందుకంటే మన హీరోల సినిమాలు ఎన్ని వచ్చినా అటు హాలీవుడ్ సినిమాలను మాత్రం అమితంగా ఆదరిస్తూ ఉంటారు ప్రేక్షకులు.
ముక్కు మొఖం తెలియని హీరోల నటించిన ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు.దీనికి కారణం హాలీవుడ్ సినిమాలలో ఉండే విజువల్ వండర్.
కాగా ప్రస్తుతం చూసుకుంటే హాలీవుడ్ సినిమాలు భారతీయ చలన చిత్ర పరిశ్రమ పై దండయాత్ర చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
గత ఏడాది కరోనా వైరస్ కాస్త గ్యాప్లో ఇచ్చిన తర్వాత స్పైడర్ మాన్ సినిమా వచ్చి ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇండియాలో 300 కోట్లకు పైగా రాబట్టింది.అంతేకాదు ఎటర్నల్ లాంటి సినిమాలు కూడా భారతీయ సినిమాలను దెబ్బకొట్టాయ్ అని చెప్పాలి.ఇక ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ బజ్ కూడా ఎక్కువ ఎక్కువగానే ఉందని తెలుస్తోంది.సినిమాకు కొనసాగింపుగా డాక్టర్ స్ట్రెంజ్ మల్టీ వర్డ్స్ ఎంతగానో ఆకట్టుకునీ మంచి వసూళ్లను సాధించింది.

ఇక ఇప్పుడు ఈ సమ్మర్ నుంచి మొదలుపెట్టి ఈ ఏడాది చివరి వరకు కూడా హాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయని తెలుస్తోంది ఇక కొందరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న డాక్టర్ స్ట్రేంజ్, టాప్ గన్ మే 27వ తేదీన విడుదల కాబోతున్నాయ్.మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న టామ్ క్రూజ్ టాప్ గన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించ పోతున్నాడు.జురాసిక్ పార్క్ సిరీస్లో భాగంగా రాబోతున్న జురాసిక్ వరల్డ్ డొమినియన్ జూన్ పదవ తేదీన విడుదలై సెన్సేషన్ సృష్టించబోతోంది.ఇక ఆ తర్వాత ద మోస్ట్ అవైటింగ్ థార్ జూలై 8న, మార్వాల్స్ హీరో బ్లాక్ పాంథర్ నవంబర్ 11న,అవతార్ 2 డిసెంబర్ 16న, స్పైడర్ మాన్ అక్రాస్ ది స్పైడర్ వర్స్ 2023 జూన్లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.







