సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలకు అన్నీ ఉన్నా కూడా కొన్ని విషయాల్లో సంతృప్తి చెందరు.చాలా వరకు వీళ్ళు ప్రైవసీ గానే బతుకుతారు.
కనీసం కాసేపు ఇంట్లో నుంచి బయటికి వెళ్లి ఎంజాయ్ చేయాలని ఉన్నా కూడా వెళ్లలేని పరిస్థితి ఉంటుంది.ఎందుకంటే వారికి అభిమానుల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి.
కాళ్ళు బయట పెడితే చాలు ఎక్కడి నుంచి ఏ అభిమాని వచ్చి ఎగబడతారో తెలియదు.
అందుకే చాలా మంది నటీనటులు తాము బయటికి వెళ్ళేటప్పుడు.
తమకు రక్షణగా సెక్యూరిటీ గార్డులను ఉంచుకుంటారు.కొన్ని కొన్ని సందర్భాలలో సెక్యూరిటీ లు కూడా అభిమానుల బెడదను ఆపలేరు.
దాంతో కొన్ని సమయాలలో తమను బయట ప్రజలు గుర్తు పట్టకుండా ఉండాలి అని ముసుగులు వేసుకుని తిరుగుతూ ఉంటారు.
ఇటీవలే హీరోయిన్ సాయి పల్లవి కూడా బయటికి వచ్చినప్పుడు ముసుగు వేసుకొని కెమెరాకు చిక్కింది.
తాజాగా అల్లు అర్జున్ కు కూడా అదే పరిస్థితి ఏర్పడింది.కాని ఆ విషయం బయట పడకపోగా తాజాగా ఆ విషయాన్ని తన తండ్రి అల్లు అరవింద్ రివిల్ చేశాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి అందరికీ తెలిసిందే.
ఇక ఈయన సినిమాల విషయం పక్కనపెడితే.
ఆయన లైఫ్ మాత్రం చాలా లగ్జరీగా ఉంటుంది.ఈయన బయటకు వెళ్లి సినిమాలు చూడాల్సిన అవసరం లేదు.
మామూలుగా చాలా మంది సినీ స్టార్ హీరోలకు, బడా బడా రాజకీయ నాయకులకు ఇళ్లల్లోని థియేటర్ స్థాయిలో సౌకర్యాలు ఉంటాయి.విడుదలైన సినిమాలను అందులో వేసుకుని చూస్తుంటారు.

అల్లు అర్జున్ కూడా అలా సినిమాలు చూస్తుంటాడు.మరి కొన్నిసార్లు థియేటర్లో కూడా చూస్తూ ఉంటాడట.అది కూడా ఎక్కడో కాదు హైదరాబాద్ కూకట్ పల్లి లో ఉన్న ఓ థియేటర్ లో.ఇదిలా ఉంటే ఇటీవలే F3 సినిమాను కూడా థియేటర్లో చూశాడట.ఆ విషయాన్ని తన తండ్రి అల్లు అరవింద్ బయటపెట్టాడు.
సినిమా ప్రారంభమైన కొద్ది నిమిషాల తర్వాత ముసుగేసుకొని రహస్యంగా థియేటర్లోకి అడుగు పెడతాడట.
ఆ తర్వాత ఇంటర్వెల్ కొద్ది సమయం ముందు బయటకి వచ్చేస్తాడట.మళ్లీ ఇంటర్వెల్ పూర్తయ్యాక.
తెరపై బొమ్మ మొదలయ్యాక వెళ్తాడట.సినిమా పూర్తయ్యే ముందు బయటికి వచ్చేస్తాడట.

అయితే F3 సినిమా కూడా అలాగే చూశాడట.అల్లు అర్జున్ ఆ సినిమాను ఇంట్లో చూడాలి అనుకుంటే.అల్లు అరవింద్ థియేటర్ లో చూడాలి అని అన్నారట.ఎఫ్ త్రీ సినిమా లాగానే మారుతి సినిమా కూడా ఇంట్లో కూర్చొని జడ్జ్ చేసేది కాదని.థియేటర్ లో చూడాల్సిన సినిమా అని అన్నాడట.దీంతో అల్లు అర్జున్ ఎఫ్ 3 సినిమాకు ముసుగులో వెళ్లి చూసి వచ్చాడట.
ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా మారింది.







