ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన గుడివాడ అమర్‌నాథ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా కొనగాగుతున్నారు.అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి వరించింది.
జగన్ మంత్రి వర్గ విస్తరణ రెండో దశలో మంత్రిగా చాన్స్ కొట్టేశారు.గుడివాడ అమర్‌నాథ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు.
తన 21వ ఏటలోనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గా గెలుపొందాడడు.అలాగే విశాఖపట్నం జిల్లా ప్రణాళిక సంఘం సభ్యుడిగా పని చేశాడు.
కాగా 2011లో కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక్కడ కూడా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, అనకాపల్లి నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్ గా పని చేశాడు.
ఇక 2019లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.టీడీపీ అభ్యర్థి గోవింద సత్యనారాయణ పై 8,169 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టి ఇప్పుడు ఏకంగా మంత్రి పదవి కొట్టేశాడు.
అంతేకాకుండా దావోస్ సదస్సుకు హాజరైన తొలి వైసీపీ మంత్రిగా పేరుతెచ్చుకున్నాడు.దావోస్ పర్యటనలో దేశంలో ఉన్న వివిధ పారిశ్రామికవేత్తలతో పాటు దాదాపు 50 బహుళజాతి కంపెనీల ప్రతినిధులు, కొత్త పారిశ్రామికవేత్తలతోనూ భేటి అయ్యామని చెప్పారు.ఈ సదస్సు ద్వారా ఏపీకి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది ధీమా వ్యక్తం చేశారు.

అయితే ఇప్పుడు ఉత్తరాంధ్రలో బుల్లెట్ ప్రూఫ్ కారున్న మంత్రిగా ఘనత సాధించాడు.ఉత్తరాంధ్రలో ఏజెన్సీ ప్రాంతాలుండటం, మావోయిస్టుల ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో జగన్ ప్రభుత్వం భద్రతాపరంగా రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపింది.ఇక ఉత్తరాంధ్రలో గుడివాడ ఎక్కడికైనా ఎప్పుడైనా పర్యటించే అవకాశం ఉంది.
అయితే చిన్న వయసులోనే మంత్రి పదవి వరించడం, పైగా ఐటీ, పరిశ్రమల బాధ్యతలు కట్టబెట్టడంతో వైసీపీలో కొందరు నేతలు కుళ్లుకుంటున్నారు.పార్టీ నేతలు గుడివాడ దశ తిరిగిందని చర్చించుకుంటున్నారు.
ఇక మంత్రిగా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.







