ఏపీ రాజకీయాల్లో జనసేన పేరు మారుమోగుతోంది.2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోరంగా ఓటమి చెందిన తర్వాత ఆ పార్టీ పని అయిపోయిందని అంతా భావిస్తున్న సమయంలోనే క్రమక్రమంగా బలం పుంజుకుంటోంది.తెలుగుదేశం పార్టీ గతంతో పోలిస్తే బాగా బలహీనపడటం, జనసేన కు బాగా కలిసి వచ్చింది. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన ప్రభావం ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో, ఆ పార్టీతో పొత్తు కోసం టిడిపి ప్రయత్నాలు చేస్తోంది బిజెపి సైతం పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఏపీలో తాము ఉమ్మడిగా అధికారంలోకి రావాలనే ప్లాన్ లో ఉంది.
దీంతో జనసేన ప్రాధాన్యం మరింతగా పెరిగిపోయింది .ఈ నేపథ్యంలోనే ఏపీ అధికార పార్టీ వైసిపి జనసేన ను టార్గెట్ చేసుకోవడం, క్రియాశీలక కార్యకర్తలు, నాయకుల పై అనేక కారణాలతో కేసులు నమోదు చేస్తూ ఉండటం వంటి వ్యవహారాలు పవన్ దృష్టికి వెళ్ళాయి.
పార్టీ తరఫున బలంగా వాయిస్ వినిపిస్తున్న నేతలను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసుకోవాడాన్ని పవన్ సైతం సీరియస్ గానే తీసుకున్నారు.ఈ మేరకు తమ పార్టీ కార్యకర్తలపై నమోదయిన కేసుల వివరాలను సేకరించాల్సిందిగా పార్టీ నాయకులను ఆదేశించారు.
ఈ కేసుల వివరాలు అన్ని అందిన తర్వాత ఆ లిస్టు తీసుకుని స్వయంగా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలవాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.

పవన్ విజ్ఞప్తిని స్వీకరించేందుకు డీజీపీ ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది క్లారిటీ లేకపోయినా జనసేన కార్యకర్తలపై కేసులు వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని అవసరం అయితే దీనిపై ఉద్యమం చేపట్టాలని పవన్ డిసైడ్ అయినట్లు సమాచారం. పవన్ తాజా నిర్ణయం పై జనసేన వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.అయితే ఈ విషయంలో జనసేన ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో
.






