సుమ న్యూయార్క్ పర్యటన వెనుక ఉన్న అసలు కారణం ఇదేనా?

యాంకర్ సుమ తెలుగు ఇండస్ట్రీలో వారం రోజులపాటు ఎంతో బిజీగా గడిపే ఈమె తన బిజీ షెడ్యూల్ కి కాస్త విరామం ఇచ్చి న్యూయార్క్ వీధులలో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.అయితే సుమ న్యూయార్క్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు తన సోషల్ మీడియా ఖాత ద్వారా షేర్ చేశారు.

 I -this The Real Reason Behind Suma Trip To New York Anchor Suma, Tollywood, Ne-TeluguStop.com

ఇకపోతే కేవలం ఈ వెకేషన్ లో సుమ మాత్రమే కనిపించడంతో ఈ వెకేషన్ పై పలువురు సందేహాలు వ్యక్తపరిచారు.సుమ కుటుంబంతో కాకుండా ఒంటరిగా ఎందుకు వెళ్లినట్టు అని ఆరా తీశారు.

అయితే సుమ న్యూయార్క్ ఎందుకు వెళ్లారు ఈమె పర్యటన వెనుక ఉన్న కారణం ఏమిటో తెలిసిపోయింది.సాధారణంగా విదేశాలలో ఎన్నో తెలుగు సంఘాలవారు ఉంటారు.

ఈ క్రమంలోనే మన తెలుగు సెలబ్రిటీలను అక్కడికి ఆహ్వానించి వారికి అయ్యే ఖర్చులను వారే భరిస్తూ అక్కడ తెలుగు వాళ్ళ చేత ఈవెంట్ నిర్వహిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే సుమా ఓ ఈవెంట్ లో పాల్గొనడం కోసం న్యూయార్క్ వెళ్లినట్లు తెలుస్తోంది.

Telugu America, American Telugu, Anchor Suma, Newyork Trip, Tollywood-Movie

ఈ క్రమంలోనే సుమ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TATA) వారు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా సుమ టాటా వారి సత్కారానికి ఫిదా అయినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే సుమా తనకు ఇలాంటి సన్మానం చేసినందుకు టాటా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.ఇకపోతే ప్రస్తుతం న్యూయార్క్ వీధులలో చక్కర్లు కొడుతున్న సుమ తిరిగి ఎప్పుడు ఇండియా వస్తారో తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube