చిన్నారుల్లో థైరాయిడ్‌ సమస్య.. బయటపడిన షాకింగ్ విషయాలు..

బిడ్డ పుట్టగానే సంతోషంతో పొంగిపోతాం.గుళ్లు, గోపురాలకు వెళ్తాం.

భక్తితో మొక్కులు సమర్పించుకుంటాం.

కానీ థైరాయిడ్‌ గ్రంథి గురించి పెద్దగా పట్టించుకోం.

థైరాయిడ్‌ లోపం అనగానే అదేదో పెద్దవాళ్ల సమస్య అనుకుంటాం.కానీ పిల్లల్లో పుట్టుకతోనూ రావొచ్చు.

గుర్తిస్తే ఇది చిన్న సమస్యే.తేలికగా అదుపు చేయొచ్చు.

Advertisement

గుర్తించకపోతే మాత్రం పెను శాపంగా మారుతుంది.పిల్లలు జీవితాంతం దీని పర్యవసానాలను అనుభవించాల్సి వస్తుంది.

ప్రస్తుతం నవజాత శిశువుల్లోనూ థైరాయిడ్‌ సమస్యలను వైద్యులు గుర్తిస్తున్నారు.ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు చెబుతున్నారు.

నోయిడాలోని పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చైల్డ్‌ హెల్త్‌కు చెందిన నియోనాటాలజీ విభాగం వారు చేసిన అధ్యయనాల్లో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.అప్పుడే పుట్టిన కొందరు చిన్నారుల్లో థైరాయిడ్‌ అసమతుల్యతను గుర్తించారు.

ఈ అధ్యయనంలో భాగంగా నెలలు నిండని చిన్నారులతో పాటు, నెలలు నిండి జన్మించిన 200 మంది శిశువులను పరిగణలోకి తీసుకున్నారు.జన్మించినప్పుడు వీరిలో కొందరు ఆరోగ్యంగా ఉన్నా, వారిని నియోనాటల్‌ ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ చిన్నారుల్లో థైరాయిడ్‌ లోపం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.థైరాయిడ్‌ హార్మోన్‌ విడుదలలో వచ్చే హెచ్చుతగ్గుల ఆధారంగా హైపో లేదా హైపర్‌ థైరాయిడిజంగా పిలస్తుంటారు.

Advertisement

ధైరాయిడ్‌ గ్రంథి సక్రమంగా పనేయకపోవడం వల్ల జీవక్రియపై ప్రభాం చూపుతుంది.థైరాయిడ్ అసమతుల్యత కారణంగా కొందరు సన్నగా మారితే మరికొందరు లావుగా మారుతారు’ అని న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రికి చెందిన ఇంటర్నల్‌ మెడిసిన్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ సురంజిత్‌ ఛటర్జీ వివరించారు.నవజాత శిశువుల్లో 10 శాతం మందికి థైరాయిడ్‌ హార్మోన్‌ లోపం ఉన్నట్లు ఆమె తెలిపారు.

థైరాయిడ్ లోపంతో జన్మించిన చిన్నారులకు వెంటనే థైరాయిడ్‌ హార్మోన్‌ రీస్లేస్‌మెంట్‌ థెరపీని తీసుకోకపోతే భవిష్యత్తులో శిశువులకు మెంటల్‌ రిటార్డేషన్‌ వచ్చే ప్రమాదం ఉందని ఫోర్టిస్‌ హాస్పిటల్‌కు చెందిన సీనియర్‌ కన్సల్టెంట్‌ పీడియాట్రిషన్‌ డాక్టర్‌ అలోక్‌ ద్వివేది తెలిపారు.

తాజా వార్తలు