రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని భద్రత పరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.
ఈరోజు ఖమ్మం- కొణిజర్ల – వైరా- తల్లాడ రహదారిపై అలాగే తల్లాడ నుండి కల్లూరు- VM బంజర్- సత్తుపల్లిలో ప్రమాదాలు జరిగే హాట్‌స్పాట్ ప్రాంతాలను పోలీస్ కమిషనర్ సందర్శించారు.ప్రమాదాలు జరిగే ప్రదేశాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ ప్రమాదాల నుండి ప్రాణాలను కాపాడేందుకు సంబంధిత శాఖలతో సంప్రదించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఎస్‌హెచ్‌ఓలు, సీఐలు, ఏసీపీలకు సూచించారు.
స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, రేడియం రిఫ్లెక్టర్లు, బారికేడింగ్‌లు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, ప్రమాద హెచ్చరికల సూచికల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.ముఖ్యంగా వేగాన్ని నియంత్రిచటం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారణకు సాధ్యమవుతుందని అన్నారు.
డ్రంక్ & డ్రైవింగ్, అతివేగాల నివారణకు ఆకస్మిత తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.
ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై అవగాహాన సదస్సులు కొనసాగిస్తు, అవసరమైన చోట్ట ప్రమాదాల హెచ్చరికల ఫ్లెక్సీలు, సైన్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రచారం చేయాలన్నారు.







