*అందరికీ దళిత బంధు ఇవ్వాలని ధర్నా

నల్గొండ జిల్లా:నియోజకవర్గ పరిధిలోని నిడమనూర్ మండల తహశీల్దార్ కార్యాలయం ముందు కెవిపిఎస్ ఆధ్వర్యంలో 1000 మంది ప్రజలతో భారీ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కెవిపిఎస్ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గానికి పదివేల దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 * Dharna To Give Dalit Kinship To All-TeluguStop.com

గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ళు,దళితులకు మూడెకరాల భూమి మాదిరిగా దళిత బంధు పథకాన్ని నీరు గార్చే ప్రయత్నం చేయొద్దని అన్నారు.ప్రతి నియోజకవర్గంలో 100 మందికి దళిత బంధు ఇవ్వడం సరికాదని,ప్రతీ దళిత కుటుంబానికి వర్తింపజేయాలని కోరారు.

కేవలం టీఆర్ఎస్ కార్యకర్తల బంధుగా దళిత బంధును చూడకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ వెంటనే అందజేయాలని కోరారు.లేకుంటే కెవిపిఎస్ ఆధ్వర్యంలో దళితులను సమీకరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube