*అందరికీ దళిత బంధు ఇవ్వాలని ధర్నా
TeluguStop.com
నల్గొండ జిల్లా:నియోజకవర్గ పరిధిలోని నిడమనూర్ మండల తహశీల్దార్ కార్యాలయం ముందు కెవిపిఎస్ ఆధ్వర్యంలో 1000 మంది ప్రజలతో భారీ ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా కెవిపిఎస్ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గానికి పదివేల దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ళు,దళితులకు మూడెకరాల భూమి మాదిరిగా దళిత బంధు పథకాన్ని నీరు గార్చే ప్రయత్నం చేయొద్దని అన్నారు.
ప్రతి నియోజకవర్గంలో 100 మందికి దళిత బంధు ఇవ్వడం సరికాదని,ప్రతీ దళిత కుటుంబానికి వర్తింపజేయాలని కోరారు.
కేవలం టీఆర్ఎస్ కార్యకర్తల బంధుగా దళిత బంధును చూడకుండా అర్హులైన ప్రతీ ఒక్కరికీ వెంటనే అందజేయాలని కోరారు.
లేకుంటే కెవిపిఎస్ ఆధ్వర్యంలో దళితులను సమీకరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
పోలీసులను ఆశ్రయించిన విజయశాంతి దంపతులు.. అసలేం జరిగిందంటే!