క్లీన్ చిట్ తెచ్చుకున్న కరాటే కళ్యాణి.. ఇకపై వాళ్లకు చుక్కలు చూపిస్తుందంటూ?

కరాటే కళ్యాణి గత వారం రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగి పోతోంది.అయితే కరాటే కళ్యాణి చిన్న పిల్లలను దత్తత పేరుతో వ్యాపారం చేస్తుంది అన్న వార్తలను ఖండించిన విషయం తెలిసిందే.

 Actress Karate Kalyani Got Clean Chit From Cwc For Child Adoption Issue Karate K-TeluguStop.com

అయితే తాజాగా చిన్నారి దత్తత విషయంపై చైల్డ్ వెల్ఫేర్ విచారణ ముగిసింది.అయితే విచారణ తరువాత కరాటే కళ్యాణి దగ్గర ఉన్న పాపన సీడబ్ల్యూసీ కమిటీ మెంబర్స్ తల్లిదండ్రులకు అప్పగించారు.

పాప తల్లిదండ్రులు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు కావడంతో అధికారులు ఈ కేసును రంగారెడ్డి అధికారులకు బదిలీ చేయడం జరిగింది.

దత్తత తీసుకునే విషయంలో ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని అధికారులు కళ్యాణి కి సూచించారు.

విచారణ అనంతరం కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ.చైల్డ్ వెల్ఫేర్ అధికారుల విచారణ పూర్తయిందని.

అధికారులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు.తనపై నిరాధారమైన ఆరోపణలు వేసిన వారిపై త్వరలో కోర్టుకు వెళ్తానని చెప్పారు.

తాను పాపను దత్తత తీసుకోలేదని.దత్తత తీసుకుంటే లీగల్‌గానే తీసుకుంటానని అన్నారు.

తాను ఎప్పుడు విచారణకు రమ్మన్నా కూడా వస్తానని అధికారులకు తాను చెప్పినట్లు వెల్లడించింది కళ్యాణి.

Telugu Child, Clean Chit, Karate Kalyani-Movie

అంతే కాకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా గత రెండు రోజులుగా తనపై చాలామంది అనేక ఆరోపణలు దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ కరాటే కళ్యాణి మండిపడింది.ఈ ఆరోపణలు తట్టుకోలేక తన తల్లి, తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటామని అన్నారని వాపోయారు.వారికి తానే ధైర్యం చెప్పి.

విచారణకు హాజరయ్యారని తెలిపారు.అయితే కళ్యాణి మాటలను బట్టి చూస్తే తన పై తప్పుడు ఆరోపణలు చేసిన వారిని అంత ఈజీ గా వదిలి పెట్టేలా కనిపించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube