చేతివాటంగల వాళ్ళు ఎక్కడున్నా తమ బుద్ధిని మానుకోలేరు.వీరిలో కొందరు కేటుగాళ్లు ఏకంగా జ్యులరి షాపులకే ఎసరు పెడుతూ వుంటారు.
సదరు షాపులో ఎన్ని సీసీ కెమెరాలు వున్నా, షాపు ఓనర్ కనుగప్పి కొంతమంది బంగారు నగలు కాజేస్తూ వుంటారు.తీరా వాళ్ళు వెళ్ళిపోయాక, తీరిగ్గా ఏ ఖాళీ సమయంలోనో సీసీ కెమెరా ఫుటేజ్ చూసిన ఓనర్ లబోదిబో అంటాడు.
ఇక సోషల్ మీడియాలో పరిధి పెరుగుతున్నవేళ దానికి సంబంధించినటువంటి అనేక వీడియోలు పోస్టు అవుతూ వస్తున్నాయి.కాగా తాజాగా అలా జరిగిన ఓ దొంగతనం నెటిజన్లకు షాక్ ని గురి చేసింది.
వీడియోలో విషయంలోకి వెళితే.జ్యువెలరీ షాపు కొచ్చిన ఇద్దరు మహిళలను కూర్చోబెట్టి బంగారు ఆభరణాలను చూపిస్తూంటాడు ఓ సేల్స్ మ్యాన్.నల్లటి వస్త్రాలు ధరించిన ఓ మహిళ షాపు వాడు అందించిన నెక్లెస్‌లు చిన్న బంగారు ఆభరణాలను గమనిస్తూ ఉంటుంది.ఇక ఆ సేల్స్ మ్యాన్ ఇతర కస్టమర్లతో బిజీగా మాట్లాడుతూ వున్న సమయంలో ఇదే అదనుగా తీసుకున్న ఆ మహిళ సేల్స్ మ్యాన్ కళ్లు గప్పి ఓ బంగారు ముక్కను నోటిలో వేసేసుకుంది.
అయితే ఆ మహిళ బంగారాన్ని మింగేసిందా.లేక కేవలం నోటిలో దాచుకుందా అన్నది వీడియోలో స్పష్టంగా తెలియడం లేదు.
అయితే సదరు వీడియోని memes.bks అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది.నెటిజన్లు భిన్న రకాలుగా దీనికి స్పందిస్తున్నారు.
బంగారం దొంగలించడానికి ఆమె ఎంచుకున్న ఐడియాను చూసి కొంతమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తే, మరికొందరు బంగారం గొంతులో ఇరుక్కున్నా, మింగినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తూ కామెంట్లు పెడుతున్నారు.నగల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ సూచిస్తున్నారు.
మరి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ఈ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.