క్లీన్ చిట్ తెచ్చుకున్న కరాటే కళ్యాణి.. ఇకపై వాళ్లకు చుక్కలు చూపిస్తుందంటూ?
TeluguStop.com
కరాటే కళ్యాణి గత వారం రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగి పోతోంది.
అయితే కరాటే కళ్యాణి చిన్న పిల్లలను దత్తత పేరుతో వ్యాపారం చేస్తుంది అన్న వార్తలను ఖండించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా చిన్నారి దత్తత విషయంపై చైల్డ్ వెల్ఫేర్ విచారణ ముగిసింది.అయితే విచారణ తరువాత కరాటే కళ్యాణి దగ్గర ఉన్న పాపన సీడబ్ల్యూసీ కమిటీ మెంబర్స్ తల్లిదండ్రులకు అప్పగించారు.
పాప తల్లిదండ్రులు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారు కావడంతో అధికారులు ఈ కేసును రంగారెడ్డి అధికారులకు బదిలీ చేయడం జరిగింది.
దత్తత తీసుకునే విషయంలో ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాలని అధికారులు కళ్యాణి కి సూచించారు.
విచారణ అనంతరం కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ.చైల్డ్ వెల్ఫేర్ అధికారుల విచారణ పూర్తయిందని.
అధికారులు తనకు క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు.తనపై నిరాధారమైన ఆరోపణలు వేసిన వారిపై త్వరలో కోర్టుకు వెళ్తానని చెప్పారు.
తాను పాపను దత్తత తీసుకోలేదని.దత్తత తీసుకుంటే లీగల్‌గానే తీసుకుంటానని అన్నారు.
తాను ఎప్పుడు విచారణకు రమ్మన్నా కూడా వస్తానని అధికారులకు తాను చెప్పినట్లు వెల్లడించింది కళ్యాణి.
"""/"/
అంతే కాకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా గత రెండు రోజులుగా తనపై చాలామంది అనేక ఆరోపణలు దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ కరాటే కళ్యాణి మండిపడింది.
ఈ ఆరోపణలు తట్టుకోలేక తన తల్లి, తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటామని అన్నారని వాపోయారు.
వారికి తానే ధైర్యం చెప్పి.విచారణకు హాజరయ్యారని తెలిపారు.
అయితే కళ్యాణి మాటలను బట్టి చూస్తే తన పై తప్పుడు ఆరోపణలు చేసిన వారిని అంత ఈజీ గా వదిలి పెట్టేలా కనిపించడం లేదు.
భారతదేశంపై చైనీయుడు ఊహించని కామెంట్స్.. “ఇదో మిస్టరీ ప్లేస్” అంటూ..