ఆడవారి కోసం గవర్నమెంట్ ఎన్నో రకాల చట్టాలు తీసుకొచ్చినప్పటికీ కామాంధుల ఆగడాలకుఅడ్డుకట్ట వేయలేకపోతున్నారు.లైంగిక వేధింపుల విషయంలో కూడా ఎన్ని చట్టాలు తీసుకు వచ్చినా కూడా ఉపయోగం లేకుండా పోతోంది.
సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ ఈ లైంగిక వేధింపుల విషయంలో బలవుతున్నారు.అంతేకాకుండా కేటుగాళ్లు కొత్త కొత్తగా పోలీసులకు చిక్కకుండా ఎలా మహిళలను వేధించాలి అన్న విషయాలను కూడా ఆన్ లైన్ లో చూసి మరి ట్రైనింగ్ అవుతున్నారు.
టెక్నాలజీని బాగా ఉపయోగించుకుని మహిళలను ఎలా పెంచవచ్చు అన్న విషయాలపై దృష్టి పెట్టి పోలీసులకు చిక్కకుండా లైగింక వేధింపులకు పాల్పడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఒక వ్యక్తి టెక్నాలజీ సహాయంతో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఒక హీరోయిన్ ఫోన్ నెంబర్ ను సేకరించి, ఆమెను వేధించడం మొదలు పెట్టాడు.
స్టార్ మేకర్స్ అనే ఒక యాప్ ద్వారా సదరు హీరోయిన్ నెంబర్ ను సేకరించిన ఆకతాయి వ్యక్తి ఆమె ఫోన్ నెంబర్ కి అసభ్యకర మెసేజ్ లు పంపించడమే కాకుండా ఆమెను మానసిక క్షోభకు గురి చేశాడు.అసభ్య పదజాలం వాడటమే కాకుండా వాయిస్ మెసేజ్ చేయడం, ఆమెకు పదేపదే ఫోన్ చేసి విసిగించడం, ఫోన్ కట్ చేస్తే మీ న్యూడ్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని బెదిరించడం, తాను చెప్పినట్టు చేయకపోతే జీవితం నాశనం అవుతుంది అంటూ ఆమెను మనోవేదనకు గురి చేసాడట.

అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన ఆమె ఇలాంటి విషయాలు బయటకు తెలిస్తే తన కెరిర్ పాడవుతుంది అని భావించి చాలా రోజుల నుంచి ఆ వ్యక్తి పెట్టే ఇబ్బందులను భరిస్తూనే వచ్చిందట.ఇక సదరు కేటుగాడు వేధింపులు మరింత తీవ్రం కావడంతో విసిగిపోయిన సదరు హీరోయిన్ హైదరాబాద్ లోని షీ టీమ్ ను సంప్రదించిందట.ఇక సదరు హీరోయిన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు టెక్నాలజీ విధానంతో ఆ హీరోయిన్ కి మెసేజ్ చేస్తూ విసిగిస్తున్న ఆ ఆకతాయిని అరెస్టు చేశారట.అయితే ఆ హీరోయిన్ ఎవరూ అన్న విషయాలను మాత్రం గోప్యంగా ఉంచారు.