జర్నలిస్టుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా:- బి.జే.పి.జిల్లా అద్యక్షులు గల్లా సత్యనారాయణ

తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ టీ.యు డబ్ల్యూ జే(ఐ.

 Bjp Will Bring The Problems Of Journalists To The Centre's Attention: - Bjp-TeluguStop.com

జే.యు) ఖమ్మం నియోజకవర్గ మహాసభలో హాజరై మీడియా మిత్రుల యొక్క సమస్యలపై బిజెపి జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ, మీడియా మిత్రులకు ఉచితంగా రైల్వే పాసులు మంజూరు చేయాలి అన్న విషయాన్ని రాష్ట్ర తప్పకుండా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెల్లి ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు.కేంద్రలో ఉన్నా నరేంద్రమోడీ ప్రభుత్వం విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయ సోదరులను ఎవరైనా దూషించిన దాడి చేసినా ఆరు నెలల పాటు జైలు శిక్ష విధించాలన్న చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేయాలని,అలాగే కోవిడ్ సమయంలో విధినిర్వహణలో కోవిడ్ కారణంచేత చనిపోయిన పాత్రికేయ సోదరులకు కేంద్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు మంజూరు చేయటం కూడా జరుగుతుందని, అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే పాత్రికేయ సోదరులు తమ దృష్టికి తెచ్చినట్లు అయితే సమస్య పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తామనితెలిపారు.పాత్రికేయ సోదరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చెప్పిన విధంగా వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube