కేజీఎఫ్‌ 2 ఇంకా ఆ రికార్డు ను బ్రేక్‌ చేయలేదట

కన్నడ సినిమా కేజీఎఫ్‌ 2 భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.సినిమా పెట్టుబడికి వచ్చిన లాభాలకు ఉన్న తేడా ను చూస్తే ఆ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 Kgf 2 Movie Record Break News Is Fake Kgf 2 , Collections, Dangal , Bahubali 2-TeluguStop.com

కాని ఇటీవల ఈ సినిమా బాహుబలి 2 ను కేజీఎఫ్ 2 బీట్‌ చేసిందనే వార్తలు వస్తున్నాయి.హిందీ వర్షన్‌ మరియు ఇతర భాషల్లో బాహుబలి 2 సినిమా విపరీతంగా వసూళ్లు సాధించింది.

మొత్తం గా 1800 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసిన విషయం తెల్సిందే.అంతటి భారీ వసూళ్లను నమోదు చేసిన బాహుబలి 2 రికార్డులను కేజీఎఫ్ 2 బీట్‌ చేసింది అనగానే ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు షాక్‌ అయ్యారు.

కాని అసలు విషయం ఏంటీ అంటే ఇప్పటి వరకు కేజీఎఫ్ 2 సినిమా వసూళ్లు బాహుబలి 2 ను బీట్ చేయలేదు.అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా దంగల్‌ సినిమా రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు చేశాయి.

కనుక ఆ సినిమా వసూళ్లను కూడా కేజీఎఫ్ 2 బీట్ చేయలేదు.కనుక కేజీఎఫ్‌ 2 గురించి కన్నడ మీడియా సంస్థలు కొన్ని చేస్తున్న పుకార్లను నమ్మనక్కర్లేదు అంటూ తెలుగు బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు ఇష్టానుసారంగా ఇండియాస్ బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ హిట్‌ మూవీగా కేజీఎఫ్ ను చెబుతున్నారు.కాని అంత సీన్ లేదు అనేది తెలుగు బాక్సాఫీస్ వర్గాల వారి స్పందన.

మొత్తానికి కేజీఎఫ్‌ 2 సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ అయిన మాట వాస్తవం.కాని దంగల్‌ మరియు బాహుబలి 2 సినిమా లను మాత్రం బీట్‌ చేయలేదు.

 కే జి ఎఫ్ 2 సినిమా వసూలు నెమ్మదించడం తో ఇక ఆ రికార్డులను బ్రేక్ చేస్తుంది అనే నమ్మకం కనిపించడం లేదు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube