రెండో రోజు పర్యటనలో బిజిబిజీగా రాహుల్​ గాంధీ

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ రాష్ట్రంలో రెండో రోజు పర్యటన బిజిబిజీగా సాగుతోంది.పలువురు మీడియా అధిపతులు, ఉద్యమకారులతో సమావేశమయ్యారు.

 Rahul Gandhi Busy On Second Day Tour , Rahul Gandhi , Second Day Tour , Nsui-TeluguStop.com

రాష్ట్రంలో కాంగ్రెస్​ పుంజుకోకపోవటానికి కారణాలేంటని.అడిగి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

అనంతరం. చంచల్​గూడ జైల్​లో ఉన్న ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలతో ములాఖాత్​ అయ్యారు.

రాష్ట్ర పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండో రోజు తీరిక లేకుండా గడుపుతున్నారు.ఉదయం 10 గంటలకు పలువురు మీడియా అధిపతులతో రాహుల్​ సమావేశమయ్యారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని మీడియాధిపతులను అడిగి తెలుసుకున్న రాహుల్.పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు స్వీకరించారు.

అనంతరం తెలంగాణ ఉద్యమకారులతో సమావేశమయ్యారు.ఈ సమావేశానికి ప్రజా గాయకుడు గద్దర్, హరగోపాల్, కంచె ఐలయ్య హాజరయ్యారు.

రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.దశాబ్దాల కలను సాకారం చేసిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఎందుకు ఆదరించడంలేదని ఉద్యమ నేతలను రాహుల్​ అడిగినట్లు తెలుస్తోంది.

రెండో రోజు పర్యటనలో బిజిబిజీగా రాహుల్​ గాంధీ : అనంతరం తాజ్ కృష్ణ హోటల్ నుంచి సంజీవయ్య పార్కుకు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సమాధి వద్ద నివాళులు అర్పించారు.పార్కులో ఏర్పాటు చేసిన శిభిరంలో కాంగ్రెస్​ నేతలతో కాసేపు కూర్చున్నారు.

ఈ నేపథ్యంలో పార్కు వద్దకు భారీగా కాంగ్రెస్​ శ్రేణులు చేరుకున్నాయి.పార్కులోకి వెళ్లేందుకు కార్యక్రర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.సంజీవయ్యపార్కులో కాంగ్రెస్​ శ్రేణులతో రాహుల్​.

అక్కడి నుంచి చంచల్ గూడ జైలుకు వెళ్లిన రాహుల్ రిమాండ్​లో ఉన్న ఎన్​ఎస్​యూఐ కార్యకర్తలతో ములాఖాత్ అయ్యారు.అధైర్యపడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని.

పార్టీ అండగా ఉంటుందని భరోసా వారికి కల్పించనున్నారు.ఈ నేపథ్యంలోనే చంచల్‌గూడ జైలులో సాధారణ ములాఖాత్‌లను అధికారులు నిలిపేశారు.

మధ్యాహ్నం 2 తర్వాత యథావిథిగా ములాఖాత్‌లు కొనసాగించనున్నారు.జైలు వద్ద 300 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇప్పటికే జైలు వద్దకు కాంగ్రెస్ శ్రేణులు, ఎన్‌ఎస్‌యూఐ నేతలు చేరుకుంటున్నారు.

చంచల్​గూడ జైలులో ములాఖాత్ ముగిశాక.

.గాంధీ భవన్​కు చేరుకుని పార్టీ నేతలతో సమావేశం అవుతారు.

ఈ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించి నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.అనంతరం సభ్యత్వ నమోదు సమన్వయకర్తలను రాహుల్ గాంధీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరిచయం చేస్తారు.

ఫొటో సెషన్​లో పాల్గొన్న తర్వాత.రెండు రోజుల పర్యటనను ముగించుకుని రాహుల్​ దిల్లీ బయల్దేరి వెళ్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube