విశాఖ జిల్లా రీజనల్కోఆర్డినేటర్, తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ వై.వి.
సుబ్బారెడ్డికి విశాఖ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన నగర మేయర్ గోలగాని హరి వెంకట కుమారి.శనివారం ఆమె విశాఖ విమానాశ్రయంలో ఉమ్మడి విశాఖ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతలు చేపట్టి మొదటసారి విశాఖ విచ్చేయుచున్న వై.వి.సుబ్బారెడ్డి కి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ ఉమ్మడి విశాఖ జిల్లాల అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి ఆయన నాయకత్వంలో కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.







