రిలీజ్ కు ముందే యూఎస్ లో సరికొత్త రికార్డ్.. ఈ రికార్డ్ సాధించిన ఏకైక హీరో మహేష్ నే..

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో మోస్ట్ అందగాడు ఎవరు అంటే వినిపించే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు.

ఈయన అందం అందరిని కట్టి పడేస్తుంది.

హాలీవుడ్ హీరోలా ఉంటాడు.అమ్మాయిల కళల రాకుమారుడు మన సూపర్ స్టార్ మహేష్.

ఈయనకు ఇప్పుడు 46 ఏళ్ళు.అయినా కూడా అమ్మాయిల మనసులను దోచుకుంటూ నెవర్ బిఫోర్ అనేలా చార్మింగ్ లుక్ లో కట్టిపడేస్తున్నాడు.

ఈయన ఫాలోయిన్ నే వేరు.సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే.

Advertisement

ఇక ఇప్పుడు ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబు రాబోతున్నాడు.మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తుంది.

ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకుని ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా సర్కారు వారి పాట.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసారు మేకర్స్.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నుండి ఇటీవలే ఊర మాస్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి భారీ రెస్పాన్స్ అందుకుంటుంది.ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసింది.ఈ ట్రైలర్ 24 గంటల్లోనే తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ వ్యూస్ సాధించిన ట్రైలర్ గా రికార్డ్ కెక్కింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

అలాగే ఇప్పటికి నెంబర్ వన్ ప్లేస్ లో ట్రెండింగ్ అవుతుంది.

Advertisement

ఇక రిలీజ్ కు ముందే ఈ సినిమా మరొక రికార్డ్ క్రియేట్ చేసింది.యుఎస్ మార్కెట్ లోనే కీ రోల్ ప్లే చేసే ఊశాలో ఈ సినిమా అత్యధిక స్క్రీన్ లలో రిలీజ్ కానుంది.ఏకంగా 605 థియేటర్స్ లలో ఈ సినిమా రిలీజ్ అవుతూ రికార్డులు నెలకొల్పుతుంది.

ఇప్పటి వరకు నాన్ పాన్ ఇండియా సినిమాలు ఏవీ కూడా ఇన్ని స్క్రీన్ లలో రిలీజ్ కాలేదు.అలా రిలీజ్ అయ్యే మొదటి సినిమా మహేష్ దే కావడం ఈయన సాధించిన మరొక ఘనత.ఇప్పుడే ఇలా ఉంటే రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

తాజా వార్తలు