కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల విజయాలతో ఓవర్ నైట్ లో శ్రీనిధి శెట్టి పాపులారిటీని పెంచుకున్నారనే సంగతి తెలిసిందే.తమిళం నుంచి ఇప్పటికే శ్రీనిధి శెట్టికి ఆఫర్లు రాగా తెలుగు నుంచి కూడా ఈ బ్యూటీకి సినిమా ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.
కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలలో తన అభినయంతో ఈ బ్యూటీ మెప్పించారు.శ్రీనిధి శెట్టి లెహంగా ధరించి ఫోటోలు దిగగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
శ్రీనిధి శెట్టి ధరించిన లెహంగా ధర 61,900 రూపాయలు కాగా ఈ డ్రెస్ పౌలమి అండ్ హర్ష్ బ్రాండ్ కు సంబంధించిన డ్రెస్ కావడం గమనార్హం.ఈ డ్రెస్ లో శ్రీనిధి శెట్టి మరింత అందంగా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సినిమాల గురించి శ్రీనిధి శెట్టి చెబుతూ సినిమా అనేది తన డ్రీమ్ అని కాకపోతే సినిమాలలో నటించాలనే కోరిక ఇంత సులువుగా నెరవేరుతుందని తాను భావించలేదని ఆమె అన్నారు.
శ్రీనిధి శెట్టికి ఇప్పటికే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కగా భవిష్యత్తు సినిమాలతో ఆమె మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
తెలుగులో స్టార్ హీరోలకు జోడీగా శ్రీనిధికి ఆఫర్లు వస్తే బాగుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.శ్రీనిధి శెట్టి మాత్రం ఆఫర్ల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
వచ్చిన ప్రతి ఆఫర్ కు ఓకే చెప్పకుండా ఆచితూచి కెరీర్ విషయంలో శ్రీనిధి శెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

శ్రీనిధి శెట్టి కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.3.5 కోట్ల రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల వరకు కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాకు శ్రీనిధి శెట్టికి పారితోషికంగా దక్కనుందని సమాచారం అందుతోంది.క్రేజ్ కు అనుగుణంగా శ్రీనిధి శెట్టి రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు.







