గత కొన్నేళ్లలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు రెమ్యునరేషన్లను పెంచారు.అయితే ఈ స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్లు అంచనాలకు మించి ఉండటం గమనార్హం.
ఈ మధ్య కాలంలో నిర్మాతలు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో హీరోల పారితోషికాలతో పాటు హీరోయిన్ల పారితోషికాలు కూడా అంచనాలను మించి పెరిగాయి.టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల నుంచి 8 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు.
పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినందుకు సమంతకు భారీగా పారితోషికం దక్కిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.మరో స్టార్ హీరోయిన్ నయనతార తెలుగు, తమిళంతో పాటు మలయాళంలో కూడా బిజీగా ఉన్నారు.
నయనతార రెమ్యునరేషన్ 5 కోట్ల రూపాయల నుంచి 7 కోట్ల రూపాయల వరకు పారితోషికం దక్కనుందని బోగట్టా.మరో స్టార్ హీరోయిన్ అనుష్క ఒక్కో సినిమాకు 6 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే 2.5 కోట్ల రూపాయల నుంచి 7 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటించి మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న రష్మిక మందన్న ఒక్కో సినిమాకు 2 కోట్ల రూపాయల నుంచి 2.5 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.

తాప్సీకి 3 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు పారితోషికం దక్కుతోందని బోగట్టా.కాజల్ అగర్వాల్ ఒక్కో సినిమాకు కోటిన్నర రూపాయల నుంచి 4 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ దక్కుతోంది.తమన్నా 5 కోట్ల రూపాయల వరకు, రకుల్ 3 కోట్ల రూపాయల వరకు, సాయిపల్లవి 2 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.సినిమాసినిమాకు ఈ స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.








