నిన్న మొన్నటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా ముంబై హీరోయిన్స్, లేదంటే మలయాళ హీరోయిన్ లు ఆధిపత్యం కొనసాగించారు.అయితే ఎప్పటి నుంచో వస్తున్న ఈ ఆనవాయితీని బద్దలు కొట్టుకొని మరీ ప్రస్తుతం కన్నడ ముద్దుగుమ్మలు దూసుకెళ్తున్నారు.
పెద్ద పెద్ద సినిమాల నుంచి చిన్న బడ్జెట్ సినిమాల వరకు ప్రస్తుతం వీరి వాహా నే నడుస్తోంది.కన్నడ సినీ పరిశ్రమ తో పోలిస్తే ఎక్కువగా భారీ చిత్రాలు తెరకెక్కడం తోపాటు అత్యధికంగా పారితోషికాలు ముట్ట చెబుతుండడంతో కన్నడ హీరోయిన్ లు ఎక్కువగా తెలుగు సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు.
మరి ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లుగా దూసుకెళ్తున్న ఆ కన్నడ తారలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్పెన సినిమాతో ఉప్పెనలా దూసుకు వచ్చింది హీరోయిన్ కృతి శెట్టి.
మంగళూరుకు చెందిన ఈ ముద్దుగుమ్మ ఉప్పెన సినిమా ఇంకా విడుదల కాకముందే తన అందంతో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.ఆ సినిమా తరువాత శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల్లో నటించింది.
ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.మరొక హీరోయిన్ రష్మిక మందన.
చలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తోంది.వర్షం సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.
ఇప్పటికే తెలుగులో మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

మరో హీరోయిన్ నభా నటేష్. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, మాస్ట్రో ఇలాంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుని నభా నటేష్.
ఈ జాబితాలో చేరిన మరొక నటి శ్రద్ధా శ్రీనాథ్.

హీరో నాని నటించిన జెర్సీ సినిమాలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి హీరోయిన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.మంగళూరు కి చెందిన మరొక ముద్దుగుమ్మా నేహా శెట్టి.
మెహబూబా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత గల్లీ రౌడీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.గల్లీ రౌడీ సినిమా తో ఈమె మరింత పాపులారిటీని సంపాదించుకుంది.







